యూట్యూబ్ సంచలనం ప్రియ వారియర్ నటిస్తున్న ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ గా డబ్ చేయబడి వచ్చేనెల వేలెంటైన్స్ డే రోజున విడుదలకాబోతుంది. ఈమూవీ ఆడియో ఫంక్షన్ ఈమధ్య హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఈ ఫంక్షన్ కు గ్లామర్ ఒలకపోస్తూ ప్రియ వారియర్ సందడి చేసింది. 
వైరల్ అవుతున్న టాటూ
అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రియా వారియర్ ఎద పై ఉన్న టాటూ మీడియా కెమెరాలకు హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఆమె వేయించుకున్న టాటూ ను ఎక్స్ పోజ్ చేస్తూ అనేక ఫోటోలు మీడియాలో హడావిడి చేసాయి. ఇలాంటి పరిస్థుతులలో ఆమె ఎద పై టాటూ రూపంలో ఉన్న అక్షరాల పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
కలలలో ఉండొద్దు
‘Carper Diem’ అనే పదంతో కూడిన ఈ టాటూ లోని అక్షరాల వెనుక అర్ధం ఏమిటి అంటూ గూగుల్ లో ఆమె అభిమానులు విపరీతంగా సర్చ్ చేసారు. చివరకు వారి పరిశోధన ఫలించి ప్రియా వారియర్ టాటూ వెనుక అర్ధాలు బయటకు వచ్చాయి.  ‘Carper Diem’ అనే పదం లాటిన్ భాషకు సంబంధించింది. 
బన్నీతో సరదాగా
ఆపదం అర్ధాన్ని విశ్లేషిస్తే ‘కలలలో విహరించ వద్దు, వాస్తవికతో జీవించండి భవిష్యత్ గురించి ఆశతో జీవించండి’ అన్న అర్ధం వస్తుంది. సామాన్యంగా సెలెబ్రెటీలు తమ ప్రియుడి పేరు కానీ లేదంటే తమ భర్త పిల్లల పేర్లు టాటూ లుగా వేయించుకుంటున్నారు. దీనికి భిన్నంగా ప్రియా వారియర్ తన టాటూ ద్వారా నేటి యూత్ కు సందేశం ఇచ్చేలా ఒక టాటూ వేయించుకోవడం ఆమె సామాజిక స్పూర్తిని సూచిస్తోంది అంటూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: