నేషనల్ సెలెబ్రెటీ రాజమౌళి తీసే సినిమాలో అవకాశం గురించి ఎందరో ఎదురు చూస్తున్నారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో హీరోయిన్స్ ఎంపిక సంబంధించి రాజమౌళికి విపరీతమైన టార్చర్ ఎదురౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను బాలీవుడ్ లో కూడ విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈమూవీలో ఒక క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ ఉంటే ఈమూవీకి బాలీవుడ్ లో మంచి బిజినెస్ ఉంటుందని రాజమౌళి భావిస్తున్నాడు.

ఇప్పుడు ఈ ఆలోచన ‘ఆర్ ఆర్ ఆర్’ హీరోయిన్స్ ఎంపికకు సమస్యగా మారి రాజమౌళికి చుక్కలు కనపడుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్. ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉండేలా రాజమౌళి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనితో రాజమౌళి ఆలోచనలు అన్నీ జాన్వీ కపూర్ అలియా భట్ సారా ఆలీఖాన్ చుట్టూ తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించడానికి ఒప్పుకుంటున్నా అత్యంత భారీ పారితోషికాలు అడుగుతున్నారని టాక్. అంతేకాదు సినిమాలు చాల స్లోగా తీస్తాడు అని రాజమౌళికి ముద్ర పడడంతో తాము నటించే డేట్స్ విషయంలో స్పష్టమైన క్లారిటీ కావాలని రాజమౌళిని ఈముగ్గురు క్రేజీ హీరోయిన్స్ అడుగుతున్నట్లు సమాచారం. 

దీనితో రాజమౌళికి ఈవిషయంలో కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే దక్షిణాది సినిమా రంగానికి ఇప్పటికే పరిచయం అయిన రకుల్ ప్రీత్ కియారా అద్వాని రాశి ఖన్నాలు రాజమౌళి కోరుకున్న విధంగా డేట్స్ ఇవ్వడానికి అదేవిధంగా తక్కువ పారితోషికంతో నటించడానికి ఒప్పుకుంటున్నా వీరి ఎంపిక విషయంలో రాజమౌళికి స్పష్టమైన క్లారిటీ లేదు అని అంటున్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ హీరోయిన్స్ ఎంపిక ఒక సమస్యగా మారి రాజమౌళి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: