నాగబాబు ఎన్నికల ముందు యూట్యూబ్ ఛానెల్ లో రాజకీయ నాయకుల మీద కామెంట్స్ చేయడం డ్యూటీ గా పెట్టుకున్నాట్టున్నాడు. అయితే ఎన్నికల ముందు ఇలా చేస్తుండటం చివరికి మెగా ఫ్యాన్స్ కు కూడా నచ్చడం లేదు. మొన్న నారా లోకేష్‌ మీద ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ మీద.. ఇలా సాగుతోంది నాగబాబు 'పంచ్‌ల' ప్రవాహం. ఆయా రాజకీయ ప్రముఖులు ఆయా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, అందులో దొర్లిన పొరపాట్లే నాగబాబుగారికి 'ఫీడింగ్‌' అన్నమాట. వాటిని పట్టుకుని సెటైర్లు వేసేస్తున్నారు.


మొత్తానికి నాగబాబు మెగా పరువు తీస్తున్నాడు గా ...!

నాగబాబు ఇలాంటివి చెయ్యకూడదా.? అంటే, చెయ్యకూడదని ఎవరు అనగలరు.! అది ఆయనిష్టం. కానీ, ఇప్పుడెందుకు ఇలాంటివి చేస్తున్నారన్నదే చాలామందికి డౌట్‌. 'భలే నాగబాబుగారూ భలేగా సంపాదిస్తున్నారు యూట్యూబ్‌ మీద..' అంటూ నెటిజన్లు నాగబాబుతో ఓ ఆట ఆడేసుకుంటుండడం గమనార్హం. ఓ వ్యక్తిగా ఆయన ఫన్‌ కోసం వీడియోలు చేసుకుంటే తప్పేమీలేదు.. జనసేన కండువా భుజాన వేసుకుని చేస్తే.. అది ఇంకో లెక్క. 'ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడతాను..' అని చెప్పి కొందర్నే టార్గెట్‌ చేస్తే ఎలా.?

Image result for nagababu

నాగబాబు తలచుకుంటే జనసేన పార్టీలో చోటు దక్కించుకోవడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, ఏమో.. తమ్ముడు పవన్‌కళ్యాణ్‌, నాగబాబుని రాజకీయాల విషయంలో పార్టీకి దూరంగా పెడ్తున్నారేమో.! అన్నట్టు, నాగబాబుకి కౌంటర్‌గా కొందరు పవన్‌కళ్యాణ్‌ నోట.. గతంలో చిరంజీవి నోట దొర్లిన పొలిటికల్‌ డైలాగుల మీద వీడియో సెటైర్లు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారండోయ్‌. దానికి తోడు జగన్ మీద నాగబాబు చేసిన అపరిపక్వ విమర్శల కారణంగా.. ఆయన్ను ఓ రేంజ్ లో ట్రాల్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: