బాలకృష్ణ స్పీచ్ అతన్ని కమెడియన్ గా మార్చేసింది. సోషల్ మీడియా లో ఒకటే ట్రోలింగ్ అవుతువుండేది. రెండేళ్ల క్రితం బసవతారకం కాన్సర్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అందరికీ గుర్తుండే ఉంటాయి. స్వాతంత్ర గణ దినోత్సవం అంటూ తడబడి, సర్వతంత్రం స్వతంత్రం అంటూ కామెడీ చేసేశాడు బాలయ్య. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు భలేగా దొరికిపోయాడు. అప్పట్లో బాలయ్య వీడియోని యూట్యూబ్ ఛానెల్స్ చీల్చి చెండాడేశాయి.

బుల్ బుల్ బాలయ్యా.. ఈ మార్పు ఏంటయ్యా!

ఆ తర్వాత కూడా వీలు దొరికినప్పుడల్లా తన ప్రతాపం చూపించి నవ్వులపూలు పూయిస్తూనే ఉన్నాడు బాలయ్య. వచ్చీరాని హిందీలో ప్రధాని మోదీకి విసిరిన సవాల్ ఎంతమంది పొట్టచెక్కలు చేసిందో చెప్పలేం. అలాంటి బాలయ్య మారిపోయాడు. ఇకపై నోటికొచ్చినట్టు మాట్లాడ్డం కంటే నోట్ చేసుకుని మాట్లాడ్డం బెటరని నిర్ణయించుకున్నాడు. ఈ రిపబ్లిక్ డేకి తొలిసారిగా బాలకృష్ణ తన ప్రసంగాన్ని రాసుకుని వచ్చి మరీ చూచి జాగ్రత్తగా తడబాటు లేకుండా మైక్ ముందు అప్పజెప్పాడు.

Image result for balakrishna speech

బసవతారకం కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో ఎన్నడూ చూడని బాలయ్యని జనం చూశారు. ఆయన స్పీచ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విమర్శకులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే అలవాట్లో పొరపాటుగా సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్స్ ని ఎదుర్కుంటున్నాడు. బాలకృష్ణ మారిపోయాడని, దీనికి కారణం నాగబాబేనంటూ కౌంటర్లు పడుతున్నాయి. నాగబాబు దెబ్బ బాలయ్య అబ్బ అంటూ బాలకృష్ణ స్పీచ్ ని ఎడిట్ చేసి మరీ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తడబడినా, పొరబడినా, సరిగ్గా మాట్లాడినా ఎలా చేసినా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతానని మరోసారి నిరూపించుకున్నాడు బాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: