నిన్న సాయింత్రం రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఆతిధ్యం ఇచ్చిన ఎట్ హోమ్ తెనేటి విందుకు ‘జ‌న‌సేన’ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా మారాడు. ప‌వ‌న్ కళ్యాణ్ తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ప్రత్యేకంగా మాట్లాడటమే కాకుండా వారిద్దరి మ‌ధ్య‌లో ప‌వ‌న్  కూర్చిని సుదీర్ఘంగా ముచ్చట్ల రూపంలో చర్చలు జరగడంతో ఈ విషయాలు దేనికిసంకేతం అన్న చర్చలు జరుగు తున్నాయి.
తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ప్రాధాన్యం..
రిప‌బ్లిక్ డే సంద‌ర్బంగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి సీయం చంద్ర‌బాబు వైసిపి అధినేత జ‌గ‌న్ లు రాకపోయినా ప్రత్యేకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావడంతో ఈకలియిక పై  రాజకీయ ప్రకంపనాలు మొదలు అయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ చాలాసేపు చాల విషయాలు పవన్ తో ఏకాంతంగా మాట్లాడటం స్పష్టంగా కనిపించింది. 
Why Is Pawan Missing In Action?
దీనితో వీరిద్దరి కలయిక వెనుక అంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య పవన్ సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన సభలో తనతో కొందరు టిఆర్ఎస్ ప్రముఖులు రాయబారాలు చేస్తున్నారని ఓపెన్ గా చెప్పి సంచలనం సృష్టించాడు. 

ఈ సంఘటన జరిగి కొద్దిరోజులు కూడ అవ్వకుండానే ఇలా పవన్ తో టిఆర్ఎస్ అధినేతలు ఓపెన్ రాజకీయ మంతనాలు ముచ్చట్లు రూపంలో జరగడం రాజకీయ వర్గాలలోనే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో కూడ సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఈకార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు ఎవరూ రాకపోవడంతో పవన్ అటు రాజకీయంగా ఇటు హీరోగా గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో ద్విపాత్రాభినయం చేసాడు..    


మరింత సమాచారం తెలుసుకోండి: