నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టి మళ్లీ తన సత్తా ఏంటో చాటిన తేజ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సీత సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుందని తెలిసిందే. విచిత్రం ఏంటంటే సీనియర్ స్టార్ హీరో కోసం రాసుకున్న ఈ కథను యువ హీరోకి సెట్ చేశాడట డైరక్టర్ తేజ.


అదెలా అంటే రానా సినిమా తర్వాత సురేష్ బాబు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్ తేజా సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సినిమా టైటిల్ కూడా సావిత్రి అని హడావిడి చేశారు. అయితే ఆ సావిత్రి సినిమా కొన్ని కారణాల వల్ల చేయడం కుదరలేదు. ఆ కథనే ఇప్పుడు బెల్లంకొండ హీరోగా చేస్తున్న సీత సినిమా అంటున్నారు.


వెంకటేష్ కోసం రాసిన కథ శ్రీనివాస్ కు ఎలా సెట్ అవుతుందని అనుకోవచ్చు. వెంకీ కోసం రాసిన ఈ కథలో భార్య భర్తల మధ్య కథగా రాసుకున్నాడట తేజ.. శ్రీనివాస్ దగ్గరకు వచ్చే సరికి అది కాస్త ప్రేమ కథగా మారిందట. లైన్ అదే కాని కొద్దిగా మార్చాడట. అంతేకాదు సావిత్రి టైటిల్ ఈ సినిమాకు పెడదామని అనుకుంటే ఆల్రెడీ నారా రోహిత్ ఆ టైటిల్ తో సినిమా చేశాడు.


అందుకే సావిత్రి బదులు సీత అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కాజల్ నెగటివి షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట. హీరోయిన్ పెట్టే టార్చర్ కు హీరో ఫైనల్ గా ఎలాంటి పంచ్ ఇస్తాడన్నది సినిమా కథ. మరి సీత సినిమా తేజకు మరో హిట్ ఇస్తుందో లేదో చూడాలి. అంతేకాదు ఈ సినిమాపై బెల్లంకొండ బాబు కూడా చాలా మంచి హోప్స్ పెట్టుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: