అక్కినేని కుటుంబానికి కోడలు అయిన తరువాత కూడ సమంత సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరియర్ ను కోనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో సమంత లేటెస్ట్ గా నటిస్తున్న ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో ఒక సీనియర్ హీరో నుండి సమంతకు పరాభవం ఎదురైంది అన్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఆ హీరో సమంత చెప్పే డైలాగుల విషయంలో విమర్శలు చేస్తూ ఆమెకు సూచనలు ఇస్తూ ఆమె పై సెటైర్లు కూడ వేసినట్లు టాక్. దీనితో ఆమె అసహనానికి గురై ఆషూటింగ్ స్పాట్ లో బ్రేక్ తీసుకుని తన సీన్స్ పూర్తి చేయకుండా వెళ్ళిపోయినట్లు గాసిప్పుల హడావిడి జరుగుతోంది. 

ఆసీనియర్ హీరో ఈమధ్య విడుదలై సూపర్ హిట్ సాధించిన ఒక మూవీలో కూడ నటించాడని తెలుస్తోంది. వాస్తవానికి చాల మంచి నటనా సామర్ధ్యం ఉన్న హీరోగా మాత్రమే కాకుండా కామెడీ టచ్ తో ఉండే డైలాగ్స్ చెప్పడంలో ఆసీనియర్ హీరోకు చాల మంచి పేరు ఉంది. దీనితో సమంతకు ఆసీనియర్ హీరో ప్రవర్తనతో కోపం వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సమంత ఎక్కువగా హీరొయిన్ ఓరియంటెడ్ సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ముఖ్యంగా ఆమె చైతన్యతో నటిస్తున్న ‘మజిలీ’ నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘బేబి’ సినిమాలు ఈ ఏడాది ప్రదమార్దంలో విడుదల కాబోతున్నాయి. అంతేకాదు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన ఒక కీలక పాత్రకు కూడ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో ఆ సీనియర్ హీరో ఏకంగా సమంతకు డైలాగులు ఎలా చెప్పాలి అన్న విషయం పై క్లాసు పీకాడు అంటూ వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: