నేషనల్ ఫిలిం సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్ తో సినిమా తీయాలని ప్రయత్నిస్తున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు ప్రభాస్ పెట్టిన కండిషన్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు పూర్తి అయిన తరువాత తన ప్రొడక్షన్ హౌస్ లో నటించడానికి ప్రభాస్ అంగీకరిస్తే బాలీవుడ్ హీరోల స్థాయిలో ప్రభాస్ కు భారీ పారితోషికం ఇస్తాను అని ఆ ప్రముఖ నిర్మాత ప్రభాస్ కు ఆఫర్ చేసినట్లు టాక్. 
Saaho-Prabhas-Stylish-Look
అయితే ఈ ఆఫర్ కు ప్రభాస్ ఏమాత్రం ఆసక్తికనపరచకుండా ఆనిర్మాతకు ప్రభాస్ కొన్ని ఎదురు డిమాండ్స్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తాను బయట బ్యానర్ లో నటించాలి అంటే ఆసినిమాకు సంబంధించి పారితోషికం తీసుకునే ఆలోచన లేదు అని చెపుతూ తన మూవీకి సంబంధించి జరిగే బిజినెస్ లో తనకు 40 శాతం వాటా కావాలి అని అడిగినట్లు తెలుస్తోంది. 
Prabhas
ప్రస్తుతం ప్రభాస్ కు నేషనల్ లెవల్ లో ఉన్న మార్కెట్ రీత్యా అతడి సినిమాకు ఖచ్చితంగా 150 కోట్ల పైచిలుకు బిజినెస్ అవుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా తాను నటించే తన సినిమా వల్ల తనకు 60 కోట్ల పారితోషికం వచ్చేలా ప్రభాస్ చెప్పిన ప్లాన్ విని ఆప్రముఖ నిర్మాత మౌనం వహించినట్లు టాక్. అంతేకాదు ప్రభాస్ నుండి ఈ అనుకోని సమాధానం విన్న ఆప్రముఖ నిర్మాత తన సన్నిహితులతో మాట్లాడుతూ ‘సాహో’ రిజల్ట్ తేడా వస్తే ప్రభాస్ కోరికలను తీర్చే నిర్మాతలు ఇండియాలో ఉంటారా అంటూ సెటైర్లు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
Prabhas is winning hearts with his sweet gestures
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు అతడి సొంత నిర్మాణ సంస్థలు కావడంతో ప్రభాస్ పారితోషికం కంటే ఎక్కువగా లాభాల పైనే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ లు అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రభాస్ కు మోజు ఏర్పడినా ప్రభాస్ నటించే అన్ని సినిమాలు ‘బాహుబలి’ స్థాయిలో విజయవంతం అవ్వవు కదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: