క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ‘కధానాయకుడు’ ను ప్రమోట్ చేస్తూ కంగనా  రనౌత్ ‘మణికర్ణిక’ మూవీ పై అనుకోకుండా చేసిన కామెంట్స్ అతడికి శాపంగా మారుతాయా అన్న కోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ‘మణికర్ణిక’ సినిమా క్రెడిట్ పూర్తిగా తనకే దక్కుతుందని ఆమూవీ ఆలోచన అంతా తనదే అంటూ ఆమూవీ విషయంలో తాను పడ్డకష్టాలను వివరించాడు. 
ఇంకా చాలా మార్పులు చేశారు
అంతేకాదు ఈసినిమాకు సంబంధించి కంగన దర్శకత్వం వహించిన స్కీన్స్ 20 శాతం మించి ఉండవు అంటూ కామెంట్స్ కూడ చేసాడు. ఇప్పుడు ఈకామెంట్స్ క్రిష్ కు శాపంగా మారబోతున్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ భారీ బడ్జెట్ సినిమాకు తొలిరోజు కేవలం ముప్పై ఐదు శాతం ఆక్యుపెన్సీతో ఈమూవీ తొలిరోజున కేవలం 9 కోట్లు గ్రాస్ వసూలు చేయడంతో ఈమూవీ కలక్షన్స్ ఫెయిల్యూర్ కూడ క్రిష్ ఖాతాలో పడబోతోందా అన్న వార్తలు వస్తున్నాయి. 
మూర్ఖంగా ప్రవర్తించింది
దీనితో మణికర్ణికకు మంచి రివ్యూలు వచ్చినా ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ లాగే కలక్షన్స్ లేక చతికలపడబోతోందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో క్రిష్ కు సామాన్య ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీసే సామర్ధ్యం లేదా అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. 
అలా చేయడం చరిత్రను వక్రీకరించడమే అని చెప్పాను
సాధారణ ప్రేక్షకులు ఝాన్సీరాణి కథ అంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండే కథతో కూడిన సినిమా అని అందరూ భావించారు. అయితే అలాంటి మాస్ ఎలిమెంట్స్ ‘మణికర్ణిక’ లో మిస్ కావడంతో ఈమూవీ నిలదొక్కుకోవడం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో కంగనా రనౌత్ కు మంచి పేరు తెచ్చిపెట్టిన ఈమూవీ క్రిష్ కు మాత్రం ఒకే నెలలో విడుదలై రెండు పరాజయాలను మిగిల్చిన సినిమాలుగా ‘కథానాయకుడు’ ‘మణికర్ణిక’ లు మారడంతో కమర్షియల్ దర్శకుడుగా క్రిష్ సమర్ధత పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: