కనుసైగలతో ఓవర్ నైట్ స్టార్డం సంపాదించిన మళయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తను నటించిన మొదటి సినిమా రిలీజ్ కాక ముందే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే పేరుతో రిలీజ్ అవనుంది. ఇక ఈ సినిమాతో పాటుగా శ్రీదేవి బంగ్లా సినిమా కూడా చేస్తుంది ప్రియా ప్రకాశ్.   


ఆడియెన్స్ లో ఆమెకు ఉన్న క్రేజ్ ను చూసి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలో ఆమె నటించే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుండగా ఇప్పుడు నాచురల్ స్టార్ నాని సినిమాలో కూడా ఆమె సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. నాని, విక్రం కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైంది.


ఆ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటించే అవకాశం ఉందట. అందులో ఒక హీరోయిన్ గా ప్రియ ప్రకాశ్ వారియర్ నటిస్తుందని తెలుస్తుంది. యూత్ లో ప్రియ ఫాలోయింగ్ చూసి తెలుగు దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూలు కడుతున్నారు. విక్రం కుమార్ సినిమా చేస్తూనే ప్రస్తుతం నాని జెర్సీ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.


జెర్సీ సినిమా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. ఈమధ్యనే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి నాని సినిమాతో తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్న ప్రియా ప్రకాశ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: