ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా పరాజయానికి కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు. సినిమా ను చాలా మంది బాగుందని చెప్పినా చివరికి ఘోరమైన ఫ్లాప్ చవిచూడటం నిజంగా బాలయ్య కు చేదు వార్త  అని చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాల్లోని పాటల బిట్లు రెండు మూడు టెంపో ఉన్న సన్నివేశాలు చూపిస్తే చాలు జనం ఎగబడి చూస్తారనే బాలయ్య తప్పుడు లెక్క ఇప్పుడు నిండా ముంచేసింది. ఏకంగా 50 కోట్ల నష్టంతో పెద్ద పంగనామమే పెట్టింది.

Image result for ntr mahanayakudu

ఎన్టీఆర్ కథానాయకుడు కొన్ని విషయాల్లో స్పష్టంగా కళ్ళు తెరిపించింది. బాలయ్య మార్కెట్ కు ఎన్ని పరిమితులు ఉన్నాయో చాటి చెప్పింది. అవతల అందరూ తిట్టిపోసిన వినయ విధేయ రామ 60 కోట్ల షేర్ రాబట్టగా అందరూ బాగుందని పొగిడిన తన సినిమా 20 కోట్లకే పురిటి నొప్పులు పడటం అభిమానులకు జీర్ణం కావడం లేదు. ఎంత పెద్ద హిట్ అయినా 40 కోట్లు చేరుకోవడమే బాలయ్యకు పెద్ద అచీవ్మెంట్. అలాంటిది ఏకంగా 70 కోట్లకు బయ్యర్లు సైతం ఎగబడి కొనడం అంతు చిక్కని విషయమే.


దెబ్బకు మహానాయకుడు ఫ్రీగా ఇచ్చినా నష్టాలు రికవరీ కావని భవిష్యత్ కనిపిస్తోంది. సో బాలకృష్ణ తన సినిమా బడ్జెట్ తో పాటు బిజినెస్ విషయంలో ఈ లెక్కలన్నీ సరిచేసుకోక తప్పదు. బయోపిక్ వైఫల్యానికి కారణాలు రాస్తే అదో పెద్ద గ్రంథమే అయ్యేలా ఉంది. అందుకే దీని గురించి మాట్లాడేందుకు కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. మొత్తానికి కథానాయకుడు కళ్ళు తెరిపించాడు. ఇకనైనా అతి విశ్వాసంతో కాకుండా కాస్త ఏమరుపాటుతో బాలకృష్ణ స్క్రిప్ట్ లను ఫైనల్ చేస్తే బెటర్

మరింత సమాచారం తెలుసుకోండి: