సినిమా రంగంలో మెగాస్టార్ గా ఉంటూ పెద్ద దిక్కుగా కూడా అనిపించుకుంటున్న మెగాస్టార్ ని ఈ మధ్య చాలా ఫంక్షన్లలో పిలవడం లేదా  లేక  ఆయన సమయం లేదని వెళ్ళడం లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్యన  అన్న గారి జీవిత కధతో తీసిన బయోపిక్ కి సంబంధించి మెగాస్టార్ ని పిలవలేదన్న దానిపైన పెద్ద రచ్చ జరిగింది. బాలక్రిష్ణకు, చిరంజీవికి విభేధాలు ఉన్నాయని కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. మరిపుడు...


పాలకొల్లులో అట్టహాసంగా జరిగిన దాసరి కాస్య విగ్రహావిష్కరణ  సభకు చిరంజీవికి పిలవలేదా అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. దాసరి నారాయణరావు శిష్యులు సినీ ప్రముఖులు  హాజరైన ఈ సభకు మెగా క్యాంప్ దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటన్న దాని మీదా ఇంటెరెస్టింగ్ డిస్కషన్ సాగుతోంది. దాసరి ప్రియ శిష్యుడిని అని చెప్పుకునే మోహన్ బాబు, మరో శిష్యుడు మురళీమోహన్ సహా ఎంతో మంది తెలుగు సినీ సీమకు సంబంధించిన  వారు ఈ మీటింగుకు హాజరయ్యారు.


పాలకొల్లులో వైభవంగా జరిగిన దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మెగాస్టార్ తో పాటు అదే సొంతూరు అయిన అల్లు కుటుంబం కూడా రాకపోవడాన్ని పెద్ద టాపిక్ చేస్తున్నారు. సంక్త్రాంతి వేళ అల్లు అర్జున్ ఇదే పాలకొల్లు వచ్చి సందడి చేశారు. మరి సినీ సీమకు పెద్ద దిక్కు, జగజ్జేత అయిన దాసరి విగ్రహావిష్కరణకు రాకపోవడం ఏంటన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి సినిమా రంగంలో మెగస్టార్ చిరంజీవి కుటుంబానికి, దాసరికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయని చెబుతున్నారు. 
దాసరి చివరి రోజుల్లో ఆసుపత్రికి వెళ్ళి మరీ పరామర్శించిన వారిలో చిరుతో పాటు, అల్లు అరవింద్  వంటి వారు ఉన్నారు. దాసరి చివరిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ కూడా చిరంజీవిదే కావడం విశేషం. మరి ఇంతలా అనుబంధం ఉన్నా చిరు రాలేదా లేక ఆయనకు ఆహ్యానం అందలేదా అన్నది చర్చ. మరి దీనికి సమాధానం నిర్వాహకులే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: