తెలుగు సినిమా పరిశ్రమలో ఉద్దండులు ఎందరో ఉన్నారు. దశాబ్దాల తరబడి వారు తెలుగు సినీ కళామ తల్లి సేవలో తరిస్తున్నారు. తమ‌దైన నటనావైదుష్యంతో వారు సినీ సీమను ఏలారు. తన తీపి గురుతులను అద్భుతమైన చిత్ర రాజాల రూపంలో ఉంచారు. అటువంటి సినిమా ప్రముఖులు ఎందరో ఇంకా జీవించే వున్నారు. 


వారి విషయంలో చూసుకుంటే ప్రతీ సారి తీరని అన్యాయమే జరుగుతోంది. ఎస్వీయార్ తరువాత అంతటి నటుడు కైకాల  సత్యనారాయణ ఉన్నారు స్వర్ణ యుగం నాటి నటీమణి జమున, వాణిశ్రే, శారద, అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మల  వంటివారు ఎందరో ఉన్నారు. తరువాత తరం తీసుకుంటే  నటనా శిరోమణులు జయసుధ, జయప్రద, రెబెల్ స్టార్ క్రిష్ణం రాజు, తనదైన కామెడీ నటనతో పాత్రకు ప్రాణం పోసే చంద్రమోహన్ రాజేంద్రప్రసాద్ వంటి  వారు కనిపిస్తారు. ఇక సీనియర్ హీరోలో చిరంజీవికి పద్మ పురస్కారం దక్కింది. ఆ వరసలో బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ ఉన్నారు. వీరందరి విషయంలో ఇంతవరకూ పద్మ అవార్డులు ఎందుకో తొంగి చూడడంలేదు.


ఇక దిగ్దర్శకులుగా సింగీతం శ్రీనివాసరావు ఎనభయ్యేళ్ల ప్రాయంలోనూ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. దర్శకుడి కే విశ్వనాధ్ కి పద్మశ్రీతో సరిపెట్టేశారు. సంగీత దర్శకుల్లో కీరవాణి, కోటి  వంటి వారు కనిపిస్తారు. మరి వీరిని ఇంతవరకూ కేంద్రం ఎందుకు గురించలేదు అన్నది తెలుగు వారి ఆవేదనగా ఉంది. ఇక దాసరి నారాయణరావుకు పద్మ పురస్కారం దక్కలేదు. ఆయనతో సరిసమానంగా సినిమాలు తీసిన రాఘవేంద్రరావు కు ఆ అవార్డ్ అందని పండు అయింది. ఇదే పొరుగున ఉన్న తమిళనాడు, కేరళలో ఎంతో మంది జూనియర్లకు  పద్వ అవార్డులు దక్కుతున్నాయి. మరి ఈ విషయంలో తెలుగు సినీ సీమ చేసిన తప్పేంటో అర్ధంకావడంలేదు. గట్టిగా ప్రశ్నించే  వారు లేకపోవడమే లోపంగా కనిపిస్తోంది మరి



మరింత సమాచారం తెలుసుకోండి: