తెలుగు ఇండస్ట్రీ లో అక్కినేని ఫ్యామిలీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అయితే మాస్ ఇమేజ్ మాత్రం ఎందుకో ఈ ఫ్యామిలీ కి రావటం లేదు. నాగార్జున కు కూడా మాస్ ఇమేజ్ చిరంజీవి , బాలకృష్ణ కు వచ్చిన రేంజ్ లో రాలేదని చెప్పాలి. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. నలుగురు టాప్ హీరోలుగా వెలిగిన రోజుల్లో రికార్డ్ ల యుద్ధం చిరంజీవి, బాలకృష్ణ మధ్యే జరిగేది. 50డేస్ సెంటర్లు, 100రోజుల సెంటర్లలో పోటా పోటీ ఉండేది.

Image result for nagarjuna and nagachaitanya akhil

వెంకటేష్ స్టడీగా ఫ్యామిలీ హిట్స్ తో దూసుకెళ్తుంటే, నాగార్జున తనదైన రొమాంటిక్ కథలతో అలరించేవాడు. మాస్ ట్రై చేసినా మిగతా ముగ్గురిలాగా ఎందుకో నాగార్జునకి అది వంటబట్టలేదు. మంచి దర్శకులు పడితేనే నాగ్ కు మాస్ హిట్స్ దొరికేవి. లేదంటే లేదు. ఇప్పుడు జనరేషన్ మారింది. మెగా ఫ్యామిలీ హీరోలు మాస్ ఆడియన్స్ పల్స్ పట్టేశారు. రామ్ చరణ్, అల్లుఅర్జున్ క్లాస్-మాస్ అనే తేడా లేకుండా దూసుకెళ్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కి మాస్ హిట్సే ఎక్కువ. దగ్గుబాటి ఫ్యామిలీలో రానా హీరో, విలన్ అనే తేడా లేకుండా జర్నీ చేస్తున్నాడు. రానాకి కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది.

Image result for nagarjuna and nagachaitanya akhil

ఇక మిగిలింది అక్కినేని ఫ్యామిలీ. అప్పట్లో నాగార్జునకు సాధ్యం కాని ఫీట్.. ఇప్పుడు కొడుకులు నాగచైతన్య, అఖిల్ కి కూడా సాధ్యంకావడం లేదు. నాగచైతన్యకి మాస్ సినిమాలు వర్కవుట్ కావని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. మాస్ మూవీ చేసిన ప్రతిసారి బొక్కబోర్లాపడ్డాడు చైతూ. అందుకే తనకి తగ్గ జానర్ లోకి వెళ్లిపోయాడు. ఇక అఖిల్ మూడు సినిమాలతో మూడు పాఠాలు నేర్చుకున్నాడు. తన లవర్ బోయ్ పర్సనాల్టీకి లవ్ స్టోరీలే బెటరని అఖిల్ కూడా డిసైడ్ అయ్యాడు కానీ నాగార్జునకి మాత్రం కొడుకుని మాస్ హీరోలా చూడాలని ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: