విజయ్ దేవరకొండ.. ఇప్పడు టాలీవుడ్‌ లో క్రేజ్ ఉన్న యంగ్ యాక్టర్.. అర్జున్ రెడ్డి, గీతగోవిందం హిట్స్ తర్వాత విజయ్ క్రేజ్ అమాంతం కొన్ని రెట్లు పెరిగిపోయింది. విజయ్ తో సినిమాలు చేసేందుకు బడా నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు.

hero vijay devarakonda photos కోసం చిత్ర ఫలితం


టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు కూడా విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారట. అదే విషయం విజయ్ దేవరకొండను అడిగాడట. సాధారణంగా దిల్ రాజుతో సినిమా అంటే హీరోలు ఎగిరిగంతేస్తారు. ఆయన సక్సస్ రేటు అలా ఉంటుంది మరి.

vijay devarakonda and dil raju కోసం చిత్ర ఫలితం


కానీ విజయ్ దేవరకొండ చెప్పిన రేటు విని దిల్ రాజుకు దిమ్మ తిరిగిందట. ఇంతకీ విజయ్ దేవరకొండ ఎంత అడిగారో తెలుసా.. అక్షరాలా పది కోట్లు.. విజయ్ చెప్పిన రేటు విన్న దిల్ రాజు.. ఆ తర్వాత సైలంట్ అయ్యారట. సో.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఉంటుందో ఉండదో చెప్పలేని పరిస్థితి.

hero vijay devarakonda photos కోసం చిత్ర ఫలితం


ఐతే.. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ పది కోట్లకు పెంచడం అంత అసాధారణమేమీ కాదు. ప్రస్తుతం విజయ్ కు ఉన్న ఫాలో యింగ్ యూత్ లో ఎవరికీ లేదు. గీత గోవిందం సినిమా ఏకంగా వందకోట్లు వసూలు చేసిన నేపథ్యంలో విజయ్ పది కోట్లు కోరడం అసమంజసమేమీ కాదు. మరి దిల్ రాజు ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: