సంక్రాంతి భరిలో రిలీజ్ అయిన F2 సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పెద్ద పెద్ద హీరోల సినిమాల రికార్డులను అధిగమించడం లో ఎంతో దూరం లో లేదు. లుగు రాష్ట్రాల్లో 15 రోజులకు 56 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా 69 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు ఇక రికార్డుల మీదకు వెళ్తుంది వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 2 కనుక మరో నాలుగు కోట్లు ఇవ్వాళ (సండే) రేపు కలెక్షన్లు సాధిస్తే, జైలవకుశ, జనతాగ్యారేజ్, దువ్వాడ జగన్నాధమ్, అత్తారింటికి దారేది, సరైనోడు, శ్రీమంతుడు రికార్డులు ఎగిరిపోతాయి.

Image result for f2 movie

అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 8 ప్లేస్ లోకి వెళ్లిపోతుంది ఎఫ్ 2, ఈ రికార్డు కష్టమేమీకాదు. ఎందుకంట సండే కచ్చితంగా రెండుకోట్లకు పైగానే వుంటుంది కలెక్షన్. అందువల్ల సులువుగా మంగళవారం నాటికి 60 కోట్ల షేర్ వచ్చేస్తుంది. మరో కోటిరూపాయలు జోడిస్తే మగధీర కూడా దాటుతుంది. కానీ అంతకు మించి వెళ్లే అవకాశం వుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే టాప్ 5 లోకి చేరాలంటే 67 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి.

రికార్డులు ఎగిపోవడం పక్కా

ఆ ఫీట్ వస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతానికి అయితే టాప్ 7లోకి వస్తుంది. టాప్ 7లో బన్నీ సినిమానే లేదు. వరల్డ్ వైడ్ గా..వరల్డ్ వైడ్ గా 15 రోజులకు 69 కోట్ల వరకు వచ్చింది. మరో అయిదు కోట్లు వచ్చి 74 కోట్లకు చేరుకుంటే, అక్కడా మగధీరను క్రాస్ చేసి టాప్ 10లో చోటు దక్కించుకుంటుంది. టాప్ టెన్ లో కూడా బన్నీ సినిమా లేకపోవడం విశేషం. సినిమా నైజాంలో బలంగా వుంది. ఇప్పటికే  19.5 కోట్లు సాధించింది. నైజాంలో బన్నీ దువ్వాడ జగన్నాధమ్ 20.20 కోట్లతో టాప్ 10లో తొమ్మిదో ప్లేస్ లో వుంది. సండేతో ఆ రికార్డు పక్కకు వెళ్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: