విజయ్ దేవరకొండ నటన మాత్రమే కాదు అతడి మనసులో నుంచి వచ్చేమాటలు కూడ చాల జెన్యూన్‌ గా ఉంటాయని అతడి అభిమానులు విపరీతంగా నమ్ముతారు. ఈనమ్మకం వలెనే విజయ్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తన మనసులోని విషయాలను ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతూ సంచలనాలకు చిరునాగా ఉండే విజయ్ దేవరకొండ  ‘సింగ్నేచర్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంలో జరిగిన మీడియా సమావేశంలో తనకు ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. 
డబ్బు, రెస్పెక్ట్ కావాలి
తాను ఎవరినో చూసి ఇన్స్‌స్పైర్ అయి సినిమా రంగం వైపు రాలేదని తన సమస్యలే తనను డబ్బు బాగా సంపాదించే ఈరంగం వైపు వెళ్లేలా మోటివేట్ చేశాయి అంటూ కామెంట్స్ చేసాడు. తనకు నటన పట్ల ఇష్టం ఉన్నా డబ్బు పేరు కలిసి వచ్చే రంగం సినిమా ఇండస్ట్రీ అన్న అభిప్రాయం తనలో కలగడంతో ఈరంగం పట్ల ఇష్టం పెంచుకుని సినిమా రంగంలో రాణించడానికి చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకున్న విషయాలను వివరించాడు.
వాళ్లని చూస్తే భయం వేస్తుంది
జీవితంలో డబ్బులు కావాలి అన్నవిషయం తనకు చిన్నప్పుడే అర్ధం అయింది అంటూ ప్రతి ఇంటిలో రెంట్ కట్టడం దగ్గర నుండి ఇంటిలో ఏదైనా ఫంక్షన్ జరిగే సందర్భం వరకు అన్నీ చర్చలు డబ్బు చుట్టూ జరుగుతాయి అంటూ ప్రతి వ్యక్తికి లైఫ్ లో డబ్బు రెస్పెక్ట్ కావాలి అంటూ మరొక ఆసక్తికర విషయాన్ని వివరించాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడ రెస్పెక్ట్ ఏర్పడాలి అంటే అది డబ్బు వల్ల అదేవిధంగా మనకు వచ్చిన పేరు వల్ల ఏర్పడుతుంది అంటూ ప్రతివ్యక్తి తాను ఎందులో రాణించగలనో అన్న ఆలోచనలు లేకుండా సమయాన్ని వృధాగా గడిపితే ఆతరువాత ఎంత ఆలోచించినా మరింత మధన పడినా ఫలితం ఉండదు అంటూ అభిప్రాయ పడుతున్నాడు విజయ్. 
విజయ్ దేవరకొండ
ఇక ఇదేసందర్భంలో ఇండస్ట్రీలో అవకాశాల గురించి వివరిస్తూ కష్టపడే మనస్తత్వంతో పాటు ఓర్పు లేకుంటే ఎంత ప్రతిభ ఉన్నా ఈరంగంలో రాణించడం చాలకష్టం అనిఅంటూ ఇక్కడ ఎవరూ ఎవరికీ ఊరికునే అవకాశాలు ఇవ్వరు అనీ ఆవ్యక్తి పై డబ్బు పెడితే తిరిగి డబ్బు వస్తుంది అనే నమ్మకం ఉంటేనే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తన అభిమానులు తన సినిమాల గురించి తన రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఎక్కువ సమయం వృథా చేసుకునే కంటే తన అభిమానులు తన తల్లి తండ్రుల గురించి తమ కెరియర్ గురించి ఆలోచించమని విజయ్ చేసిన కామెంట్స్ అతడి నిజాయితీని సూచిస్తున్నాయి అంటూ ఆమీడియా సమావేశానికి వచ్చిన అనేకమంది మీడియా ప్రతినిధులు అభిప్రాయపడినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: