ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం నుండి తేజా తప్పుకున్న తరువాత ఆవిషయం గురించి ఎప్పుడు ఓపెన్ గా తేజ మాట్లాడ లేదు. ఈవిషయమై ఎప్పుడు తన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగుస్తూనే ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్న తరువాత తేజ బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ తో ‘సీత’ అనే మూవీని నిర్మిస్తున్నాడు. 
NTR-Biopic-Movie-Launch-Photos (1)
హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ ఫస్ట్ లుక్ ఈమధ్యనే విడుదలైంది. ఈ నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ స్పాట్ కు కొంతమంది మీడియా ప్రతినిధులను పిలిచి ఈసినిమా విశేషాలను మీడియాకు వివరిస్తున్న నేపధ్యంలో తేజాకు ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ కు సంబంధించి ఒక అనుకోని ప్రశ్న ఎదురైనట్లు సమాచారం.
NTR Biopic Kathanayakudu Release Date
‘కథానాయకుడు’ మూవీలో సినిమా సక్సస్ కు అవసరమైన డ్రామా పార్ట్ మిస్ అవ్వడం వల్ల ఆమూవీ ఫెయిల్ అయింది అని వస్తున్న వార్తల పై తేజా స్పందన కోసం ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు తేజా ఒక ఊహించని సమాధానం ఇచ్చాడు అని తెలుస్తోంది. ఒక సినిమా సక్సస్ అన్నది ఆమూవీ దర్శకుడు సమర్ధతను బట్టి ఆధారపడి ఉంటుందని ఆమూవీ ఫెయిల్యూర్ కు గల కారణాలు తాను ‘కథానాయకుడు’ సినిమా చూడకుండా కామెంట్ చేయను అని చెప్పినట్లు టాక్. 
NTR biopic new posters out, release date unveiled—See inside
అంతేకాదు ప్రస్తుతం తాను ‘సీత’ మూవీ విషయంలో చాల బిజీగా ఉన్న నేపధ్యంలో తాను ‘కథానాయకుడు’ సినిమాను చూడలేదని తేజ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఒక సినిమా పరాజయానికి అనేక కారణాలు ఉంటాయని వాటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒక దర్శకుడునో లేదంటే హీరోనో టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసే మనస్తత్వం తనది కాదు అంటూ తేజ చేసిన వ్యూహాత్మక కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: