అఖిల్ నటించిన మూడవ సినిమా ‘మిస్టర్ మజ్ను’ ఫలితం కూడ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో అఖిల్ కు సమాధానం లేని ప్రశ్నలు ఎదురౌతున్నాయని సమాచారం. వాస్తవానికి సున్నిత మనస్తత్వం కలిగిన అఖిల్ కు ‘మిస్టర్ మజ్ను’ ఫలితం అంత సులువుగా మరిచిపోయే షాక్ కాదు అని అంటున్నారు. 
ఓవర్సీస్ కలెక్షన్
వాస్తవానికి ఈసినిమాలో అఖిల్ నటనకు అతడి లుక్స్ కు విమర్శకులు నుండి మంచి మార్కులు వచ్చాయి. అయితే అఖిల్ నటనలో వచ్చిన మార్పును సామాన్య ప్రేక్షకుడు గుర్తించ లేకపోయాడు. యూత్ ను టార్గెట్ చేద్దామని వెంకీ అట్లూరి చేసిన ప్రయత్నాలు అన్నీ ‘మిస్టర్ మజ్ను’ లో ఫెయిల్ కావడంతో 23 కోట్ల వరకు బిజినెస్ జరిగిన ఈమూవీ బయ్యర్లకు సగానికి సగం నష్టాలు వస్తాయి అన్న ప్రచారం జరుగుతోంది. 
సినిమా ఎంతకు అమ్మారు?
ఈసినిమాకు రిపబ్లిక్ డేతో కూడిన వీకెండ్ ఏమాత్రం కలిసిరాకపోగా నిన్న ఆదివారం కూడ మన తెలుగు రాష్ట్రాలలో చాల చోట్ల కొన్ని షోలకు సంబంధించి కలక్షన్స్ క్షీణించడంతో వర్కింగ్ డే అయిన ఈ మొదటి సోమవారం పరిస్థితి ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి మొదటిరోజు ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. 
ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా
ముఖ్యంగా ఈసినిమాకు ఓవర్సీస్ లో కూడ ఊహించని ఎదురీత ఎదురౌతోంది. ఈ మూవీకి నిన్న ఆదివారం కేవలం 20 వేల డాల్లర్స్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి అన్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దీనితో ఈమూవీ ఓవర్సీస్ బయ్యర్ కు భారీ నష్టాలు తప్పవు అన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఎవరైనా నిర్మాత ధైర్యం చేసి అఖిల్ తో సినిమాను తీసినా కనీసం ఆ సినిమాలు విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: