టాప్ సెలెబ్రెటీస్ ఆదాయం గురించి అదేవిధంగా వారి పాపులారిటీ గురించి అనేక ప్రముఖ బాలీవుడ్ పత్రికలు తరుచూ ఆసక్తికర కథనాలు ప్రచురిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థుతులలో ఒక ప్రముఖ బాలీవుడ్ పత్రిక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ ఆదాయం పై ఈమధ్య ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
ఈకథనంలో దక్షిణ భారతదేశ సినిమా రంగానికి సంబంధించి టాప్ హీరోయిన్ గా అనుష్కను పేర్కొంటూ ఆమెకు ఉన్న ఆస్థుల పై ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 
Image may contain: 1 person, smiling
ఆ బాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం ఇప్పటి వరకు 50 సినిమాలలో నటించిన అనుష్కకు సుమారు 150 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. సినిమాలతో పాటు ఆమెకు వాణిజ్య ప్రకటనల రీత్యా భారీ మొత్తాలలో ఆమెకు పారితోషికాలు కర్ణాటకలో బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా వచ్చినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. 
Image may contain: 1 person, smiling, close-up
అంతేకాదు అనుష్కకు హైదరాబాద్ - బెంగళూరు - మంగుళూరు - వైజాగ్ వంటి చోట్ల స్థిర ఆస్థులు ఉన్నట్లు ఆకథనంలో పేర్కొనడమే కాకుండా ఆమె తన డబ్బును ఖరీదైన విల్లాలు కార్లు బంగారం వజ్రాల రూపంలో దాచుకున్నట్లు ఆ కథనంలో పేర్కొనడంతో అనుష్క రేంజ్ అందరికీ అర్ధం అవుతుంది. ఆమధ్య అనుష్క తన వద్ద పనిచేసే డ్రైవర్ కు 12 లక్షలు విలువ చేసే కారు గిఫ్ట్ గా ఇచ్చిన సందర్భాన్ని కూడ ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. 
Image may contain: 1 person, smiling, night
విలాసవంతమైన అనుష్క ఇంటి గురించి వివరిస్తూ అనుష్క ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఇంటి విలువ 12 కోట్లు ఉంటుందని ఈ స్థిరాస్థులతో పాటు అనుష్కకు  బీఎండబ్ల్యూ 6 సిరీస్ కు చెందిన అత్యంత ఖరీదైన కార్లు కూడ అనుష్క వద్ద ఉన్నాయని ఆకథనంలో వివరింపబడింది. ఇప్పటి వరకు అనుష్క పెళ్ళి గురించి అనేక పత్రికలు ఆశక్తికర కథనాలు ప్రచురించాయి ఇప్పుడు ఆ బాలీవుడ్ పత్రిక అనుష్క ఆస్థుల విషయం పై కూడ కథనాలు వ్రాస్తూ ఉండటంతో ప్రస్తుతం మీడియాలో అనుష్క వార్తల జోరు మళ్ళీ మొదలైంది..



మరింత సమాచారం తెలుసుకోండి: