తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన స్టంట్ మాస్టర్ రాజు 67వ జయంతిని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయి పేటలో నిర్వహించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్.టి రామారావు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు స్టంట్ మాస్టర్ రాజు మంచి హిట్స్ ఇచ్చారు.  స్టంట్ మాస్టర్ రాజు 67వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి అనంతలక్ష్మి మాట్లాడుతూ.. స్టంట్ మాస్టర్ రాజు చనిపోయి 9 సంవత్సరాలు అయినా ఇంతవరకు సినీ పరిశ్రమ కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోలేదని అన్నారు. 

ఆయన వద్ద ఎంతోమంది హీరోలు శిక్షణ పొందారని అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారని..కానీ ఆయన కూడా తమ కుటుంబ పరిస్థితి గురించి పట్టించుకోలేదని వాపోయారు.  ఇక రాజు మాస్టార్ వద్ద శిశ్యులుగా రామ్‌లక్ష్మణ్‌లు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని..బాహుబలి ఫైట్ మాస్టర్ సాల్మన్ రాజు కూడా రాజు శిష్యుడేనని తెలిపారు. 
Image result for STUNT MASTER RAJU
అయితే బాహుబలి చిత్రానికి స్టంట్ మాస్టర్ సాల్మన్ రాజ్‌కు నేషనల్ అవార్డు రావడం గర్వంగా ఉందని...ఆయన శిశ్యుడికి అవార్డు తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు.  కానీ, చిత్ర పరిశ్రమకు ఎంతో సేవలందించిన మాస్టర్ రాజు ని మర్చిపోవడం అత్యంత బాధాకరమని అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: