ఆమె ఓ ప్రముఖ డైరెక్టర్ భార్య. అలాంటి ఇలాంటి డైరెక్టర్ కాదు.. బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాడుఅలాంటి డైరెక్టర్ల భార్యలు సాధారణంగా ఏం చేస్తుంటారు.. చక్కగా ఫిలిం ఇండస్ట్రీ ఫ్రెండ్స్ తో కలసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. లేకపోతే గృహిణిల్లా తమ బాధ్యతలు చూసుకుంటుంటారు.



కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సౌజన్యా శ్రీనివాస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. భర్త డైరెక్టర్ అయినా తన కళను మాత్రం వదల్లేదు. ఆమె ఓ క్లాసికల్ డ్యాన్సర్.. పాతికేళ్లుగా నృత్యం చేస్తున్నారు. డాన్స్ అంటే ఆమెకు ప్రాణం.



తాజాగా ఆమె విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాట్య ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్, నటుడు సునీల్ వంటి వారు హాజరయ్యారు. ఆమె నాట్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఆమె నాట్యాన్ని అంతా మెచ్చుకున్నారు.



ప్రదర్శనకు హాజరైన సునీల్ మాట్లాడుతూ.. తనకు సౌజన్య పాతికేళ్ల నుంచి తెలుసని.. ఓ డైరెక్టర్ భార్య అయినా.. నాట్యంపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఈ ప్రదర్శనే చెబుతుందని మెచ్చుకున్నారు. అవును మరి. కళపై మమకారం ఉండాలే కానీ హోదాలతో పనేముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: