‘బిగ్ బాస్’ సీజన్ 3కు సంబంధించిన వార్తలు ఇప్పుడు జూనియర్ చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఈవిషయాలు అన్నీ రాజమౌళి దృష్టి వరకు వెళ్ళినట్లు సమాచారం. ఈ షోను నిర్వహిస్తున్న ‘స్టార్ మా’ యాజమాన్యం ఈసారి ‘బిగ్ బాస్ సీజన్ 3’ ని చాల భారీస్థాయిలో నిర్వహించడమే కాకుండా ఈకార్యక్రమానికి సంబంధించిన ప్రైజ్ మనీని 50 లక్షల నుండి కోటి రూపాయలకు పెంచి ఈ షోలో బాగా పేరున్న సెలెబ్రెటీలు పాల్గొనేలా స్టార్ మా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 

ఈసారి ప్రసారం కాబోయే ఈషో ఆరు నెలలు కొనసాగేలా స్టార్ మా వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈభారీ ప్రయత్నానికి హోస్ట్ గా జూనియర్ ను మరొకసారి పెట్టాలి అని స్టార్ మా ప్రయత్నాలు చేయడమే కాకుండా ఈప్రయత్నాలకు జూనియర్ సహకరిస్తే అతడికి దాదాపు 20 కోట్ల వరకు భారీ పారితోషికం ఇచ్చేలా ప్లాన్ రచించడంతో జూనియర్ ప్రాధమికంగా ఈఆఫర్ కు ఆకర్షితుడు అవుతున్నా రాజమౌళి ఫైనల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. 

వాస్తవానికి ఈషోకు సంబంధించి జూనియర్ ను ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలు ప్రతి ఆదివారం ఉదయం 4 నాలుగు గంటలు ఈకార్యక్రమంలో పాల్గొనేలా చేసి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇబ్బంది లేకుండా సహకరిస్తానని స్టార్ మా ప్రతివాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు వెంటనే ఒప్పుకోవద్దనీ తాను అన్నీ ఆలోచించిన తరువాత మాత్రమే ఈవిషయంలో తన ఫైనల్ నిర్ణయం తెలియచేస్తానని రాజమౌళి జూనియర్ కు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు టాక్. 

అంతేకాదు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో వివిధ భాషలకు సంబంధించిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న నేపధ్యంలో డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్ అనుకున్నంత సులువు కాదని ఈవిషయంలో చాల ఆలోచించవలసి వస్తుందని రాజమౌళి జూనియర్ తో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు తనసినిమాలో నటించే హీరోలు తరుచూ మీడియాలో ఛానల్స్ లో కనిపిస్తే తనమూవీకి సంబంధించిన క్రేజ్ తగ్గిపోతుంది అని భావించే రాజమౌళి జూనియర్ కోసం తన పద్ధతిని మార్చుకోవడం కష్టం అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: