టాలీవుడ్ లో మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో హీరోగా మారారు.  రవితేజ నటన మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.  దాంతో మాస్ మహరాజ గా పలు చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  బాబి దర్శకత్వంలో వచ్చిన పవర్ చిత్రం తర్వాత రవితేజకు ఏ చిత్రం పెద్దగా కలిసి రాలేదు.  ఒకప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. 
Image result for raviteja disco raja
ఈ చిత్రం సీక్వెల్ కిక్ 2 అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  ఆ తర్వాత వచ్చిన బెంగాల్ టైగర్ కూడా డిజాస్టర్ అయ్యింది.  దాంతో సినీ పరిశ్రమకు రెండు సంవత్సరాల విరామం ఇచ్చాడు రవితేజ. కామెడీ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మాస్ రాజ్ స్టామినా ఏంటో చూపించాడు.  ఈ చిత్రంలో ఫుల్ లెన్త్ అంధుడిగా నటించిన రవితేజ హీరోయిజం ఎక్కడా తగ్గకుండా అదే మాస్ స్టైల్ చూపించడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు.  రాజాది గ్రేట్ లో అంధుడిగా నటించిన సక్సెస్ పొందిన రవితేజ మరోసారి ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నారట.
Image result for raviteja raja the great
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' నిర్మితమవుతోంది. వీఐ ఆనంద్చిత్రాలు రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉంటాయి. ఈ చిత్రంలో కథ ఆరంభంలో రవితేజ వృద్ధుడిగా కనిపిస్తాడట. ఆ తరువాత తన శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్ధుడిగా వున్న ఆయన యువకుడిగా ఎలా మారిపోతాడనేదే సస్పెన్స్. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ కథ సాగుతుందని చెబుతున్నారు.  కాన్సెప్ట్  కొత్తగా వున్న కారణంగానే ఈ సినిమా చేయడానికి వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: