బాలీవుడ్ లో ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన సన్నీలీయోన్ నటించిన సినిమాలు తక్కువే అయినా..కాంట్రవర్సీలు ఎక్కువగా ఉండటంతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.  ఫోర్న్ ప్రపంచం నుంచి బాలీవుడ్ లోకి వచ్చిన సన్నీలియోన్ గతలో పలు విమర్శలు ఎదుర్కొన్నా..ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ తో దర్శక, నిర్మాతలు పలు ఛాన్సులు ఇస్తున్నారు.  తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా సన్నీలియోన్ కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించింది.  తెలుగు లో మంచు మనోజ్, డాక్టర్ రాజశేఖర్ సరసన చిందులేసింది. 
Image result for mammootty
తాజాగా ఈ హాట్ బ్యూటీ మెగాస్టర్ తో చిందులేయబోతున్నట్లు సమాచారం.  మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.  ఆయన నటించిన కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా బెస్ట్ కలెక్షన్లు సాధించన సంఘటనలు ఉన్నాయి.  యాక్టింగ్ లో నేషనల్ వైడ్ గా బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న ఈ మెగాస్టార్ ఇప్పుడు సన్నీ లియోన్ తో చిందులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు.  మమ్ముట్టి నటిస్తోన్న సినిమా మధుర రాజా.   2010లో వచ్చిన సూపర్ హిట్ సినిమా పొక్కిరి రాజాకు ఇది రీమేక్. 
Image result for sunny leone
ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కాంట్రవర్సల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.  ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సన్నీలియోన్ చిందులేయ బోతుందట. షూటింగ్ స్పాట్ లో ఇటీవల వీరు కలిసి ఉన్న ఫొటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.  మరోవైపు తెలుగు లో మహివి రాఘవన్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘యాత్ర’సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: