హాలీవుడ్ లో మొదలైన మీ టూ ఉద్యమం బాలీవుడ్ కి పాకింది.  ఇండస్ట్రీలో నటీమణులపై జరుగుతున్న అఘాయిత్యాలను వెల్లడించే నేపథ్యంలో బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా ‘మీ టూ ’ ఉద్యమానికి శ్రీకారం చుడుతూ..గతంలో తనను ప్రముఖ నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు చేసింది.  అంతే కాదు ఓ దర్శకుడు, నృత్య దర్శకుడు అతనికి వత్తాసు పలికారని సంచలన ఆరోపణలు చేయడంతో బాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.  ఇక దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ‘మీ టూ ’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 
Image result for tanu sri dutta
గతంలో తనపై ప్రముఖ గేయ రచయిత వైర ముత్తు అసభ్యంగా ప్రవర్తించారని..లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించింది.  అప్పటి నుంచి చిన్మయిపై రక రకాల దాడులు మొదలయ్యాయి.  తాజాగా ట్విట్టర్ లో చిన్మయి చేస్తున్న పోరాటం గురించి ఆమెను అభినందించారు ఓ అభిమాని..ఈ సందర్భంగా మీరు చీర కట్టుకుంటే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారు. 
Image result for chinmayi singer
దానికి స్పందించిన చిన్మయి..షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.  చీర కట్టు అంటే తాను ఎంతగానో గౌరవిస్తానని..కానీ గతంలో చీర కట్టుకుంటే కొంతమంది సైడ్ నుండి నా ఎద భాగం, నడుము కనిపించేలా ఫోటోలు తీసి వారిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్లోడ్ చేశారు. మరికొంత మంది దారుణంగా..వాటిని చూస్తూ masturbating చేసుకున్న విషయాలను నాకు మెసేజ్ లుగా పంపించారు'' అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. అందుకే తాను చీర కట్టుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: