సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ మధ్య పాపులర్ అవుతున్న సింగర్ చిన్మయి శ్రీపాద అనేక విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలపై అమె మాట్లాడుతున్న తీరు బాగా ఉంది. ఇక ఆమె అనేక సంచలన విషయాలను కూడా తన గురించి  చాలా చెబుతున్నారు. సమాజం, మనుషులు ఇలా కూడా ఉంటారా అన్నది ఆమె చెబుతున్న దాన్ని చూస్తూంటే తెలుస్తోంది.


తనకు చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టమని చెబుతున్న చిన్మయి ఇప్పుడు వాటిని కట్టుకోవడం మానేసానని అంటోంది. దీని వెనక బలమైన కారణం కూడా ఉందని అంటోంది. అదేంటంటే  తాను అభిమానుల కోసం చీర కట్టుకుని ఉండగా ఒక కార్యక్రమంలో కొందరు  తనను సైడ్ నుండి ఫొటోలు తీసి సాఫ్ట్ పోర్న్ సైట్స్ లో పోస్ట్ చేశారు. సైడ్ నుండి తన  చెస్ట్ భాగం కనిపిస్తూ ఉన్న ఫొటోలు ఆ సైట్స్ లో పోస్ట్ చేయడంతో కొందరు ఆ ఫొటోలు చూస్తూ అసభ్యంగా( మస్తుర్బతింగ్) ప్రవర్తించి వీడియోలను చిత్రీకరించుకుని అవి తన‌కు పంపించారట. ఆ వీడియోలు అత్యంత దారుణం. ఆ వీడియోలు తన‌కు పంపడంతో చీరలు కట్టుకోవడం మానేశానంటూ సమాధానం చెప్పుకొచ్చింది.


నిజంగా ఇది చాలా బాధాకరం కదా. ఓ సెలిబ్రిటీ జీవితంతో ఇలా ఆడుకోవడమే కాదు. ఆడది అన్న ఆలోచన సైతం లేకుందా అశ్లీలమైన ఫొటోలు తీసి దాన్ని ఇలా పంపడం కంటే దారుణం వేరొకటి లేనే లేదు. ఏది ఏమైన చిన్మయి లాంటి వారికే ఇలా లైంగిక వేధింపులు, ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఇక సామాన్యుల గురించి వేరే చెప్పాలా. చట్టాలు కాదు, మన ఆలొచనలు మారితేనే సమాజంలో మార్పు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: