నిధి చాల సుఖమా...రాముని సన్నిధి చాల సుఖమా అని త్యాగరాజస్వామి కీర్తన ఉంది. టాలీవుడ్ మాత్రం అందాల నిధి ఉంటేనే కాసులు సుమా అంటోంది.  అటువంటి సౌందర్యాల నిధి అగర్వాల్ సవ్యసాచి మూవీ ద్వారా ఎంటరై  నాగ చైతన్యతో జోడీ కట్టింది.  రెండో సినిమా కూడా అక్కినేని చిన్నోడు  అఖిల్ పక్కనే చేసింది.  లేటెస్ట్ గా వచ్చిన మిష్టర్ మజ్ఞూ మూవీ నిధికి మంచి మార్కులే వేసింది.


దాంతో ఈ అమ్మడు ఇపుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో కొత్త మూవీలో బుక్ అయింది. ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పక్కన నిధి నటిస్తున్న ఈ మూవీ పేరు ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలో ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలై హైదరాబాద్‌లో జరుగుతుంది.  న్యూలుక్‌తో అదరగొడుతున్న రామ్, ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు ఫస్ట్‌లుక్ చూస్తే తెలుస్తోంది. మరి రామ్ ప‌క్కన నిధి అంటే ఈ జంట బాగానే ఉంటుందంటున్నారు


పైగా పూరీ కొత్త లుక్ లో హీరోయిన్లను చూపించడం నిధికి ప్లస్ అవుతుందని కూడా చెబుతున్నారు. నిధి కి అందం, అభినయం రెండూ ఉన్నాయి. టాలీవుడ్ కి ఎటూ హీరోయిన్ల కొరత ఉంది. మే నెలలో రిలీజ్ అయ్యే ఈ మూవీ కనుక హిట్ అయితే నిధి టాలీవుడ్ కి అసలైన పెన్నిధి  అయినా ఆశ్చర్యపోనక్కరలేదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: