ఈరోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పై చేసిన కామెంట్స్ దేనికి సంకేతం అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యంగ విరుద్ధమని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు ఈ విభజన వల్ల జరిగిన అన్యాయం గురించి రాజకీయ పక్షాలు ఎవరూ అప్పట్లో సక్రమంగా స్పందించలేదు అన్న అభిప్రాయాన్ని జనసేనాని వ్యక్త పరిచాడు. 

అంతేకాదు ఈవిభజన వల్ల తెలుగు రాష్ట్రాలలోని భావితరాలకు నష్టం కలుగుతుందని పవన్ అభిప్రాయపడుతున్నాడు. అదేవిధంగా అనుకోని పరిణామాలు ఎదురై భవిష్యత్ లో ఇరు రాష్ట్ర ప్రజలు కోరుకుంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాలు కలిసిపోయినా ఆశ్చర్యం లేదు అంటూ పవన్ చేస్తున్న కామెంట్స్ దేనికి సంకేతం అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పవన్ చేసిన ఈకామెంట్స్ సమైక్యతావాదులను ఆకట్టుకోవడానికి ఉద్దేశించినవా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మౌనం వహించిన పవన్ ఇప్పుడు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో గత చరిత్ర విషయాలను ఇప్పుడు తెలుగు ప్రజలకు ఎందుకు గుర్తుకు చేస్తున్నాడో అర్ధంకానీ విషయంగా మారింది. 

ఒకవైపు పవన్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ విభజన సక్రమంగా జరగలేదు దానివల్ల తెలుగు ప్రజలు నష్టపోయారు అని చెపుతున్న మాటలకు తెలంగాణ ప్రాంత నాయకుల నుండి ఎటువంటి స్పందన వస్తుంది అన్న విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న  సమయంలో ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన ఈసున్నిత విషయాన్ని పవన్ ఇప్పుడు ఈ అస్త్రాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: