గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ తమన్నా. ఆమె టాలీవుడ్ ని పదేళ్ళుగా ఏలుతోంది. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా ఎఫ్ 2 తో డీసెంట్ హిట్ కొట్టిన తమన్నా తన కెరీర్ గురించి చెబుతూ ఇంటెరెస్టింగ్ విషయాలు ఎన్నో పంచుకుంది. 


ఇప్పటివరకూ తాను గ్లామర్ డాల్ గానే సినిమాల్లో కనిపించానని, ఇక మీదట నటనకు స్కోప్ ఉన్న పాత్రలు వేయాలని ఉందని తమన్నా అంటోంది. తనలోని నటనను బయటకు తెచ్చే పాత్రలకే తన ఓటు అని చెప్పుకొస్తోంది. తాను మొదట్లో వేసినవి అందానికి ప్రాధాన్యత ఉన్నవి, ఆడి పాడేందుకు   మాత్రమే అవకాశం ఉన్న పాత్రలని, వాటి వల్ల స్టార్ ని అయ్యాను తప్ప మంచి నటిగా గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.


ఇకపైన అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని అంటోంది. నిర్మాతలు, దర్శకులు తనలోని నటిని చూసి అవకాశాలు ఇస్తే తప్పక చేస్తానని అంటోంది. ఆడవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడితే తప్పేంటని బోల్డ్ గా ప్రశ్నించిన ఈ అమ్మడు సమాజం మారుతోంది కాబట్టి ఎప్పటికపుడు సినిమాలూ మారుతున్నాయని అంటోంది. ఏది ఏమైనా తాను మాత్రం నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తానని అంటోంది. తనకు ఐటెం సాంగ్స్ మంచి పేరు తెచ్చాయని వాటిని చేయడం అంటే డ్యాన్స్ బాగా వచ్చిన తనకు ఎంతో ఇష్టమని అంటోంది.


ఇకపైన కూడా ఐటం సాంగ్స్ చేస్తానని కూడా తమ్మూ చెబుతోంది. తన పెళ్ళి అందరికీ చెప్పే చేసుకుంటానని గ్యాసిప్పులు నమ్మి తనను ప్రశ్నలు వేయవద్దంటోంది. తన తల్లితండ్రులు చూపించిన సంబంధం చేసుకుంటానని గడుసుగా ఈ ముద్దు గుమ్మ చెబుతోంది. సైరా లో మెగాస్టార్ పక్కన నటిస్తున్న తమ్మూ త్వరలో కొత్త ప్రాజెక్టుల  గురించి చెబుతానని అంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: