తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు నటి  సుభాషిణి. తెలుగు,తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో కలుపుకుని సుభాషిణి దాదాపు 100 సినిమాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ శ్రీదేవితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. చెన్నైలో విజయనిర్మల ఆంటీ ఇంటికి దగ్గరలోనే శ్రీదేవి వాళ్లు వుండేవాళ్లు...ఆ సమయంలో శ్రీదేవితో తనకు పరిచయం అయ్యిందని అన్నారు. 
Image result for actress sridevi
మా వయసు కూడా పెద్దగా తెడా లేకపోవడం వల్ల ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. నేను ఆంటీ ఇంటికి వచ్చినప్పుడల్లా శ్రీదేవి ఇంటికి వెళ్లి కబుర్లు చెబుతూ ఉండేదానిని. వయసుతోపాటే మా మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో శ్రీదేవి మంచి హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకుంది..తనకు మూవీస్ అంటే ఎంతో ఇష్టం కానీ థియేటర్లోకి వెళ్లి చూడాలంటే భయం. అందుకోసమే ఎవరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో శ్రీదేవి..నేను ఇద్దరం బురఖాలు వేసుకుని సినిమాలకి వెళ్లేవాళ్లం.

తన అక్క జయసుధకు తనకు చాలా వ్యత్యాసం ఉందని..తాను చాలా సాఫ్ట్ గా ఉంటుందని..తాను మాత్రం కాస్త అల్లరి అంటూ తెలిపింది. జయసుధ సెట్ కి వచ్చిన తరువాత ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు...ఏదో ఒక పుస్తం చదువుతూ వరైనా పలకరిస్తే మాట్లాడుతుంది. ఏదైనా ఒక టాపిక్ వస్తే .. దాని గురించి మాట్లాడుతుంది.  కానీ తాను మాత్రం మాట్లాడటం మొదలుపెట్టానంటే నాన్ స్టాప్ గా మాట్లాడేస్తూనే వుంటాను. నేను మాట్లాడేది కరెక్టా .. కాదా? అనేది నాకు తెలియదు.  ఎదుటి వారిని మభ్య పెట్టడం..మాయమాటలు చెప్పడం తనకు అస్సలు చేతకాదని అన్నారు సుభాషిణి . 


మరింత సమాచారం తెలుసుకోండి: