ఈ మద్య సినీ పరిశ్రమలో కొత్తగా వచ్చే హీరోయిన్లు ఎంత గ్లామర్ ప్రదర్శిస్తే..అంతగా రాణిస్తారని లేదంటే కెరీర్ కి పులిస్టాప్ పెట్టాల్సిందే అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.  టాలీవుడ్ లో కొంత మంది ఆ స్థాయిలో గ్లామర్ ప్రదర్శన చేయలేకనే వెలుగులోకి రాలేక పోతున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది.  అందుకోసమే దర్శక, నిర్మాతలు ఎక్కువగా బాలీవుడ్ ఇతర భాషల హీరోయిన్లను తమ సినిమాల్లో నటింపజేస్తుంటారు.  అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం కేవలం తమ నటనతోనే కోట్ల మంది అభిమానుల అభిమానం సంపాదిస్తు స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్తుంటారు. 

అలాంటి వారిలో ‘మహానటి’ఫేమ్ కీర్తి సురేష్.  మాలీవుడ్ కి చెందిన  కీర్తి సురేష్ తల్లి కూడా ఒకప్పుడు నటి.  మెగాస్టార్ చిరంజీవి నటించిన  ‘పున్నమినాగు’ సినిమాలో నటించిన మేనకా సురేష్ కుమార్.  చిన్నతనం నుంచే సినీ పరిశ్రమ టచ్ ఉన్నా కీర్తి సరేష్ మాత్రం గ్లామర్ తరహా పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సాంప్రదాయంగా కనిపిస్తూ వచ్చింది.  రామ్ హీరోగా నటించిన నేను శైలజ తెలుగులో మంచి హిట్ అయ్యింది.  ఆ తర్వాత నాని హీరోగా ‘నేను లోకల్’కూడా మంచి విజయం అందుకుంది. 
Image result for keerthi suresh mother
ఆ తర్వాత వచ్చిన ‘మహానటి’ తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ కి మంచి పేరు వచ్చింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో జత కడుతూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీ తల్లి కంటే మీరే ఎక్కువ పేరు సంపాదించుకున్నట్లు ఉన్నారు?  అని ప్రశ్నించగా.. దానికి ఆమె అమ్మ స్థాయిని అందుకోవడం చాలా కష్టమని, ఆమె 120 సినిమాల వరకు చేసిందని కాకపోతే ఎక్కువగా మాలీవుడ్ లో నటించడం వల్ల ఆమె గొప్పతనం కొద్ది మందికే తెలుసని అన్నారు. 
Image result for keerthi suresh mother
చిత్ర పరిశ్రమలోకి వచ్చే సమయంలో ఆమెకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని..ఎంతో కష్టపడి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందని...పెళ్లి తరువాత వ్యక్తిగత జీవితం కోసం నటనకు దూరమైందని.. అయినా సంతోషంగా ఉన్నానని చెప్పేవారని తెలిపింది. కథ నచ్చితేనే చేస్తానని..గ్లామర్ తరహా పాత్రలకు దూరంగా ఉంటానని..నటిగా, వ్యక్తిగా మా అమ్మే నా రోల్ మోడల్ అని అంటోంది కీర్తి సురేష్. 


మరింత సమాచారం తెలుసుకోండి: