ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు పర్యాయలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి వి రాఘవన్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘యాత్ర’చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది.  ముఖ్యమంత్రి కావడానికి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఎంతో ఘన విజయం సాధించింది.  ఈ పాద యాత్రతో ప్రజల మనసులోకి వెళ్లారు వైఎస్సాఆర్. 
Image result for ysr yatra movie
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.  రిపబ్లిక్ డే సందర్భంగా పల్లెళ్ళో కళ ఉంది అనే సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం, తాజాగా యాత్ర నుండి మరుగైనావా రాజన్నా, కనుమరుగైనావా రాజన్నా అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది. మా ఇంటి దేవుడివే, మాకంటి వెలుగువే, ఒరిగినావా రాజన్నా అనే సాంగ్ గుండె పిండేస్తుంది.  ఈ పాట అచ్చమైన రాయలసీమ యాసలో కంపోజ్ చేశారు. ఈ పాటను పెంచల్ దాస్ పాడటమే కాదు అందరి కంట కన్నీరు వచ్చేలా మాయ చేశారు. 
Image result for ysr yatra movie
ఈ చిత్రం ఫిబ్రవరి 1న యాత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.  మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, వై.ఎస్.ఆర్ తండ్రి రాజారెడ్డిగా కనిపించనున్నారు.  ఫిబ్రవరి 8న యాత్ర గ్రాండ్‌గారిలీజ్ కానుంది. సంగీతం : కె (కృష్ణ కుమార్), కెమెరా : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : మహి వి.రాఘవ్.


మరింత సమాచారం తెలుసుకోండి: