సినిమా రంగంలో వారసత్వం చాలా కామన్. హీరోల కొడుకులు హీరోలు కావడం చాలా కాలం నుంచీ వస్తున్నదే. హీరోల కొడుకులే కాకుండా.. అల్లుళ్లు, మేనల్లుళ్లు, బావలు, బావమరుదులు కూడా హీరోలు అవుతున్న రోజులివి. అలాంటిది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు హీరో అవుతాడని ఆశించడంలో విచిత్రమేమీ లేదు.

akira nandan latest కోసం చిత్ర ఫలితం


పవన్ కల్యాణ్- రేణూదేశాయ్ ల సంతానం అకిరానందన్ తాజా చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ విజయవాడలో కొత్త ఇంటిలోని ప్రవేశించిన సమయంలో అకిరానందన్ కూడా పవన్ తో పాటు ఉన్నాడు. పవన్ మూడో భార్య అన్నాలెజ్నోవాతో పక్కన అకిరా ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.



ఆ ఫోటోల్లో పవన్ వారసుడిని చూసిన అభిమానులు తమ నాయకుడి జూనియర్ వచ్చేశాడని సంబరపడుతున్నారు. అకిరానందరన్ పవన్ ను మించి హైట్ ఉండటం చూసి మురిసిపోతున్నారు. మెగా క్యాంపస్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలుగా వచ్చిన నేపథ్యంలో అకిరానందన్ హీరోగా రావడం అన్నది పెద్ద విషయమేమీ కాదు.

సంబంధిత చిత్రం


కానీ అకిరానందన్ తల్లి రేణూ దేశాయ్ మాత్రం.. అతడిని జూనియర్ పవన్ గా చూడొద్దని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేస్తోంది. అకిరానందన్ కంటూ సొంత ఐడెంటిటీ ఉండాలని తన కోరుకుంటోంది. ఆమె కోరిక ఎలా ఉన్నా మెగా ఫ్యాన్స్ మాత్రం అకిరా లేటెస్ట్ ఫోటోస్ చూసి సంబరపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: