‘ఎఫ్ 2’ సూపర్ సక్సస్ తో ఇప్పుడు ఎక్కడ విన్నా అనీల్ రావిపూడి సమర్ధత పైనే మాటలు వినిపిస్తున్నాయి. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ డైరెక్టర్ ను రాజమౌళి కొరటాల శివ రేంజ్ తో పోలుస్తూ మీడియా అనిల్ రావిపూడి పై ప్రశంసలు కురిపిస్తోంది. 

ఇలాంటి పరిస్థుతులలో నిర్మాత దిల్ రాజ్ అనీల్ రావిపూడికి ఒక స్పెషల్ క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అనీల్ రావిపూడి సినిమాలలో నటించడానికి టాప్ హీరోలు అంతా ఎదురు చూస్తూ ఉంటే ఆవిషయాలను పట్టించుకోకుండా అనిల్ రావిపూడి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాను తీయడానికి ప్రయత్నిస్తూ ఒక టాప్ హీరోయిన్ కు ఆకథను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 
Supreme Director With Another Mass Hero
దీనితో ఈన్యూస్ వైరల్ గా మారి టాప్ హీరోలు అంతా అనీల్ రావిపూడి చెప్పే కథల గురించి వేచి చూస్తుంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల వైపు అనీల్ రావిపూడి ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అన్న విషయం సస్పెన్స్ గా మారింది. ఈ విషయాలను తెలుసుకున్న దిల్ రాజ్ అనీల్ రావిపూడి ప్రయత్నాలకు అడ్డు చెపుతూ ఇలాంటి ప్రయోగాలతో కెరియర్ పాడు చేసుకోవద్దని సలహాలు ఇచ్చినట్లు టాక్. 
Anil Ravipudi
అంతేకాదు అనీల్ రావిపూడి సినిమాలు అంటే ప్రేక్షకులు నవ్వులు ఉంటాయని భావిస్తున్న పరిస్థుతులలో ప్రయోగాత్మక సినిమాలు తీయవద్దని అనీల్ కు దిల్ రాజ్ హెచ్చరించినట్లు సమాచారం. దీనితో అనీల్ రావిపూడి తన ప్రయత్నాలు మానుకుని ఎవరో ఒక టాప్ హీరోతో సినిమాను తీస్తాడా లేదంటే తను ఇప్పటికే వ్రాసుకున్న కథ పై పెంచుకున్న నమ్మకంతో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ వైపు అడుగులు వేస్తాడా అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: