బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్ తో నటించిన ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సస్ సాధించడంతో ఈబ్యూటీ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎటువంటి మొహమాటాలు పాటించని ఈ బ్యూటీకి మంచి నటిగా కూడ పేరుంది. ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించిన తరువాత కియారా పేరు సంచలనానికి మారుపేరుగా మారిపాయింది.
kiara-advani_142503915820
ఇలాంటి పరిస్థుతులలో ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకుని నటించిన ‘వినయ విధేయ రామ’ ఫెయిల్ అవ్వడంతో టాలీవుడ్ లో ఆమె మార్కెట్ దెబ్బ తింటుందా అన్న టెన్షన్ ఆమెకు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అయితే ఆ టెన్షన్ నుంచి ఆమెను బయటపడేసేలా ఒక క్యాలెండర్ కు వచ్చిన స్పందన ఆమెకు జోష్ ను కలిగించడమే కాకుండా కియారాకు యూత్ లో ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది. 
Kiara Advani Begins Shooting For Her Telugu Debut Film Bharat Ane Nenu
కొత్త సంవత్సరం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ డబూ రాత్నాని విడుదల చేసిన క్యాలెండర్ కు కియారా అద్వాని ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ఇప్పుడు సంచలనంగా మారడమే కాకుండా ఆ క్యాలెండర్స్ కు విపరీతమైన డిమాండ్ వచ్చేలా పరిస్థుతులు ఏర్పడ్డాయని సమాచారం. కియారా హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోలతో ఉన్న ఈ క్యాలెండర్ ధర 500 రూపాయలు అయినా పట్టించుకోకుండా హాట్ కేక్స్ లా అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
Lust Stories: Kiara Advani Reveals What Karan Johar Told Her Before Filming Masturbation Scene
దీనితో సినిమాల ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పెరిగిన కియారా క్రేజ్ కు ఇదే నిదర్శనం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అందుకే కాబోలు ఆమె గోపీచంద్ లాంటి ఫెయిల్యూర్ హీరోతో నటించాలి అంటే 2 కోట్ల పారితోషికం అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం టాప్ హీరోల దృష్టిలో కియార కంటే పూజ హెగ్డే కు ఎక్కువ మార్క్లులు పడటం కియారాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: