బాలీవుడ్ విలక్షణ నడులు నానా పటేకర్ ఇంట విషాదం నెలకొంది.  ఆయన తల్లిగారు నిర్మ‌లా ప‌టేక‌ర్ (99) సోమ‌వారం మృతి చెంద‌గా, ఆమె అంత్య‌క్రియ‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వ‌హించారు.  నిర్మ‌లా ప‌టేక‌ర్ కొద్ది రోజులుగా ముంబైలో నానాతోనే క‌లిసి ఉంటుంది. అయితే నిర్మలా పటేకర్ చనిపోయే సమయానికి నానా పటేకర్ ఇంట్లో లేరట.

తన తల్లి మరణ వార్త వినగానే హుటాహుటిన ఇంటికి చేరుకున్నారట.  త‌ల్లిని ఎంతో ప్రేమ‌గా చూసుకునే నానా ప‌టేక‌ర్‌కి ఆమె మ‌ర‌ణం దిగ్భ్రాంతిని క‌లిగించింది.  మెమోరీ ఇష్యూస్‌తో కొద్ది రోజులుగా ఆమె బాధ‌ప‌డుతున్నారు. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లోను నానా త‌న త‌ల్లితో ఉన్న అనుబంధాన్ని ప్ర‌స్తావించారు.  నానా ప‌టేక‌ర్ త‌న 28 ఏళ్ళ వ‌య‌స్సులోనే తండ్రి కోల్పోయాడు.

ఒషివారా క్రిమాటోరియంలో నిర్మ‌లా పాటేక‌ర్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌గా మ‌ల్హ‌ర్ ప‌టేక‌ర్ , స‌న్నిహితులు కుటుంబ స‌భ్యులు త‌దిత‌రులు అంతిమ సంస్కారాల‌లో పాల్గొన్నారు.  ఇటీవల రజినీకాంత్ నటించిన ‘కాలా’సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు నానా పటేకర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: