నేచురల్ స్టార్ నాని నటించిన సినిమాలు రెండు వరస పరాజయాలు చెందినా అతడి మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదర లేదు అన్న విషయం ప్రస్తుతం ఇతడు నటిస్తున్న 'జెర్సీ' విషయంలో మరొకసారి రుజువు అవుతోంది. ఈ సినిమాకు దాదాపు 50 కోట్ల బిజినెస్ అయినట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమా మార్కెట్ కు సంబంధించిన మరొక ఆసక్తికర విషయం ఇప్పడు వెలుగులోకి వచ్చింది. 

యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం   వహిస్తున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అయితే ఈ నిర్మాణ సంస్థ గతంలో పవన్ తో 'అజ్ఞాతవాసి' జూనియర్ తో 'అరవింద సమేత' నిర్మించిన హారిక హాసిని ప్రొడక్షన్స్ కు సంబంధించిన నిర్మాణ సంస్థ కావడంతో బయ్యర్స్ మార్కెట్ లో 'జెర్సీ' కి మంచి క్రేజ్ ఉన్నా తక్కువ మొత్తాలకు అమ్మ వలసిన పరిస్థితి ఏర్పడింది అన్నవార్తలు వస్తున్నాయి.  

'అఙ్ఞాతవాసి' భయంకరమైన ప్లాప్ అయితే 'అరవింద సమేత' బయ్యర్లకు కూడా కొన్ని ఏరియాలలో నష్టాలను తెచ్చి పెట్టింది. దీనితో ఈ రెండు సినిమాలతో పాటు ఇదే నిర్మాణ సంస్థ నిర్మించిన 'శైలజ రెడ్డి' వల్ల  నష్టపోయిన బయ్యర్లలును ఆదుకోవడానికి  'జెర్సీ' ని మార్కెట్ ఆఫరింగ్స్ కంటే తక్కువకు అమ్మినట్లు తెలుస్తోంది. దీనితో నాని పవన్ జూనియర్ ల నష్టాలను తీర్చగల స్థాయికి ఎదిగిపోయాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సమ్మర్ రేస్ ను టార్గెట్  చేస్తూ ఏప్రిల్ లో విడుదలకాబోతున్న  ఈ మూవీ పై భారీ స్థాయిలో పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ ఏర్పడినా పవన్  జూనియర్ ల నష్టాలను తీర్చవలిసిన మూవీగా ఇది మారడం సంచలనంగా మారింది. అనుకున్న విధంగా ఈ మూవీ విజయం సాధించగలిగితే స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తో ప్రస్తుతం నిర్మించపబడుతున్న చాలా సినిమాలకు ఇది ట్రెండ్ సెట్టర్ గా మారే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: