హీరోయిన్స్ ఇప్పడూ సోషల్ మీడియా ను బాగానే ఉపయోగించు కుంటున్నారు. హాట్ ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. అయితే ఆ వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు ఆమెకు భారీగా డబ్బు ఆఫర్ చేస్తూ ఊహించని ప్రపోజల్స్ పెడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సాక్షి చౌదరి తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. 2013లో 'పోటుగాడు' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాక్షి... అందంలో సూపర్ హాట్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్లో సరైన హిట్స్ పడక పోవడంతో చిన్న సినిమాలకే పరిమితమైంది. 

Image result for sakshi chowdary

‘నా వీడియోలు, ఫోటోలు చూసిన తర్వాత కొందరు పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక రాత్రికి కోటి రూపాయలు ఇస్తామంటూ ఇన్ బాక్సులో మెసేజ్ పెడుతున్నారు.... అంటూ సాక్షి చౌదరి తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. నాకు అలాంటి ఆఫర్స్ ఇస్తున్నవారంతా మూర్ఖులు. నేను అమ్మకానికి లేను అనే విషయం గుర్తుంచుకోవాలి... అంటూ తనకు అలాంటి అభ్యంతరకరమైన ఆఫర్స్ ఇస్తున్న వారికి సాక్షి తనదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు. 


నా ఫోటోలు, వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. అంతే కానీ ఇలా చేయడం సరికాదు. త్వరలో నేనే నటించిన ‘మాగ్నెట్' విడుదల కాబోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి... అంటూ సాక్షి చౌదరి సూచించారు. సాక్షి చౌదరి నటించిన మాగ్నెట్ సినిమా విషయానికొస్తే... ఈ చిత్రానికి ఎం. ఆదిశేషసాయి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. 

https://twitter.com/i/status/1089008662880825344

మరింత సమాచారం తెలుసుకోండి: