‘మిస్టర్ మజ్ను’ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుని కలక్షన్స్ విషయంలో ఘోరంగా పడిపోయినా ఆపరాజయాన్ని లెక్కచేయకుండా అఖిల్ ఆసినిమాను ప్రమోట్ చేస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అఖిల్ యంగ్ హీరోలకు ట్యాగ్స్ ఇస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
స్టోర్స్ స్క్రిప్టు రావడం అంత సులభం కాదు
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్మార్ట్ ఎవరు? అన్నప్రశ్నకు సమాధానం ఇస్తూ జూనియర్ ఎన్టీఆర్ అంతతెలివైన వ్యక్తి ఇండస్ట్రీలో మరెవ్వరూ లేరు అంటూ కామెంట్స్ చేసాడు. ఇక హార్డ్ వర్క్ చేసే విషయంలో తన అన్న నాగచైతన్య ముందు వరసలో ఉంటాడు అని పేర్కొంటూ ఇండస్ట్రీలోని హీరోలలో కన్నింగ్ ఎవరు? అన్నప్రశ్నకు సమాధానం ఇస్తూ రానా దగ్గుబాటి చాల కన్నింగ్ అంటూ జోక్ చేసాడు అఖిల్. 
చిరంజీవిగారే మాస్
అదేవిధంగా ఇండస్ట్రీలో హ్యాండ్ సమ్ హీరోగా మహేష్ స్థానాన్ని ఆక్రమించే హీరోలు మాస్ హీరోగా చిరంజీవి స్థానాన్ని ఆక్రమించే హీరోలు ఇప్పట్లో ఎవరు వచ్చే ఆస్కారం లేదు అంటూ తన మనసులోని అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెట్టాడు. ఇదేసందర్భంలో తన తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ తనతండ్రి సలహాలు ఇస్తాడు కానీ ఆసలహాలను పాటించమని ఎప్పుడు ఒత్తిడి చేయడని తన సినిమాలకు సంబంధించిన ప్రయోగాలు అన్నీ తన నిర్ణయాలే అంటూ తనపై తానే కామెంట్స్ చేసుకున్నాడు అఖిల్. 

తన తండ్రి సినిమాలలో తనకు ‘హలో బ్రదర్’ ‘మన్మధుడు’ ఇష్టం అని చెపుతూ తన తల్లి సినిమాలలో తనకు ‘పుష్పకవిమానం’ బాగా నచ్చుతుంది అన్న అభిప్రాయం వ్యక్త పరిచాడు. తాను విపరీతంగా స్మోకింగ్ చేసే అలవాటు నుండి బయటపడటానికి చాల కష్టపడ్డాను అంటూ అందువల్ల ఎవర్ని వ్యసనాల జోలికి వెళ్ళవద్దని సందేశాలు ఇస్తున్నాడు అఖిల్. ‘మిస్టర్ మజ్ను’ ఫెయిల్యూర్ తో హ్యాట్రిక్ పరాజయాలు సొంతం చేసుకున్న అఖిల్ హీరోగా నిలదొక్కుకోవాలి అంటే ఎవరైనా ఒక ప్రముఖ దర్శకుడి సహాయం లభిస్తేకాని అఖిల్ కోలుకోలేడు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ప్రస్తుత పరిస్థుతులలో అఖిల్ కోసం నాగార్జున ఏనిర్ణయాలు తీసుకుంటాడు అన్న విషయం పై ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: