యూట్యూబ్ సంచలనం ప్రియా వారియర్ నటిస్తున్న 'లవర్స్ డే' వచ్చేనెల వేలంటైన్స్ డే నాడు విడుదల కాబోతున్న నేపథ్యంలో  ఈ బ్యూటీ క్రేజ్ ఎంతవరకు కలక్షన్స్ తెచ్చి పెడుతుంది అన్న ఆసక్తితో టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టాప్ హీరోలు ప్రియా వారియర్ తో నటించాలి అని అభిప్రాయపడుతున్నా ఆమె మొదటి సినిమా రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు. 
Image may contain: 1 person, smiling, standing and outdoor
ఇలాంటి పరిస్థుతులలో దర్శకుడు విక్రమ్ కుమార్ నానీతో తీయబోతున్న సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక పాత్రలో ప్రియా వారియర్ చేత నటింపచేయాలని ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈపాత్రలో నటించడానికి ప్రియా వారియర్ కు భారీ పారితోషికం ఆఫర్ చేసినా ఆమె స్పంధించలేదు అని తెలుస్తోంది. 
Image may contain: 1 person, smiling, close-up
దీనికి కారణం నాని సినిమాలో విక్రమ్ కుమార్ ప్రియా వారియర్ కు ఆఫర్ చేసింది చెల్లెలు పాత్ర. ఈపాత్రకు కథ రీత్యా చాలా ప్రాముఖ్యత ఉన్నా ఒక టాప్ హీరోకు చెల్లిగా నటిస్తే ఇక భవిష్యత్తులో అన్ని సినిమాలలోనూ చెల్లి పాత్రలే వస్తాయి కాబట్టి విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చినా ప్రియా వారియర్  సాహసం చేయడానికి ఇష్టపడ లేదు అని టాక్. దీనితో నానీకి మరో గ్లామర్ చెల్లె కోసం విక్రమ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
Image may contain: 1 person, smiling, close-up
ప్రస్తుతం నాని నటిస్తున్న 'జెర్సీ' విడుదల అయిన వెంటనే ఈమూవీ చిత్రీకరణ మొదలు అవుతుంది అని అంటున్నారు. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలలో చెల్లి సెంటిమెంట్ మిస్ అవుతున్న నేపథ్యంలో ఒకప్పుడు తెలుగు సినిమాలకు కనక వర్షం కురిపించిన చెల్లి సెంటిమెంట్ ను నేటి తరం ప్రేక్షకులకు గుర్తుకు చేయడానికి విక్రమ్ కుమార్ నానీతో ఇలాంటి ప్రయోగం చేస్తున్నాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: