ఈ మద్య ఇతర భాష చిత్రాలు తెలుగు లో రిమేక్ చేస్తున్నారు..అలాగే తెలుగు చిత్రాలు కూడా ఇతర భాషల్లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తమిళంలో హిట్ అయిన 96 చిత్రాన్ని తెలుగు లో రీమేక్ రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా ఇందులో శ‌ర్వానంద్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఫ్రెష్ కంటెంట్‌తో  96 చిత్రం 2018లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ నిలిచింది.  ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.
Image result for sharwanand samantha
తెలుగులో విజయ్ సేతుపతి పాత్రలో శర్వనంద్, త్రిష పాత్రలో సమంత నటించబోతున్నారు.  ఇక కన్న‌డ‌లోను 96 చిత్రాన్ని రీమేక్ చేస్తుండ‌గా, 99 అనే టైటిల్‌తో చిత్రం రూపొందుతుంది. మ‌ల‌యాళ న‌టి భావ‌న త్రిష పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో గ‌ణేష్ కనిపించ‌నున్నాడు.  రాము ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ క‌న్న‌డ వ‌ర్షెన్‌కి సంబంధించిన రైట్స్‌ని చేజిక్కించుకోగా, ప్రీత‌మ్ గుబ్బి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది.
Image result for 96 movie
అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ హీరో గ‌ణేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.  99 చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, వీలైనంత త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సమ్మ‌ర్‌లో మూవీని రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట. 

మరింత సమాచారం తెలుసుకోండి: