పొరిగింటి పుల్ల కూర ఎంతో రుచి అన్నది సామెత. టాలీవుడ్ కి ఇది అచ్చంగా సరిపోతుంది. మనకు ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా బయట నుంచి తేవడానికే ఇష్టపడతారు. హీరోలు మాత్రమే మన వారు. మిగిలిన సరుకంతా బాలీవుడ్డో కోలీవుడ్డో రావాల్సిందే. దీంతో తెలుగు చచ్చిపోతోంది. టాలెంట్ కూడా పక్కన పడుతోంది.


టాలీవుడ్లో సీనియర్ హీరోలు ఇపుడు ఒక హీరోయిన్ అంటే మోజు పెంచుకుంటున్నారు. కోలీవుడ్ రాణి నయనతారతో చేయాలని వారి ఆరాటం. అయితే నయన్ మాత్రం దారుణంగా నో చెప్పేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు అనేకమార్లు నేను చేయను అంటున్న మన హీరోలు మాత్రం ట్రై చేయడం మానడంలేదు. తాజాగా ఓ సీనియర్ హీరో మూవీలో జోడీగా నయన్ కావాలని పట్టు పట్టాడని టాక్. దాని కోసం బడ్జెట్ పరిమితులు కూడా దాటి రాయబేరాలు నడిపినా నయన్ చేయనంటూ ఆఫర్ ని పక్కనపెట్టేసింది.


సదరు హీరోకు అంతకు ముంది నయన్ తో ఓ వివాదం కూడా ఉంది. ఆమె వల్ల ఆయన సినిమాకు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అయినా సరే అవన్నీ మరచి నయన్ అని కలవరించడం వింతే మరి. ఇక మరో సీనియర్ హీరో కూడా తనకు నయన్ ఉంటే సక్సెస్ అంటూ ఆమె కోసం ప్రతీ సినిమాకు ట్రై చేసే ఓ సినిమాకు జత కట్టింది. తీరా ఆ మూవీ ఏవరేజ్ అయింది. ఇపుడు ఆ హీరో మళ్ళీ కొత్త సినిమాలు  అనౌన్స్ చేస్తున్నాడు. జోడీగా నయన్ అయితే బాగుంటుందని ప్రపోజల్స్ పంపుతున్నారట.


 ఇక నయన్ తెలుగులో మెగస్టార్ తో ఒకే మూవీ సైరా చేస్తోంది. మరో మూవీకి  ఆమెను చిరు కాంబోలో అడిగినా ఇప్పటికైతే అఫీషియల్ గా కన్ ఫర్మ్ కాలేదు. మరి నయన్ కంటే టాలెంటెడ్ ఆర్టిస్టులు మనకు లేరా అన్నది ఇక్కడ ప్రశ్ణగా ఉంది. నయన్ అంటూ టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ పరవడం పట్ల మిగిలిన హీరోయిన్లు కూడా గుస్సా అవుతున్నారట. మరి ఇకనైనా మన హీరోలు నయన్ మోజు తగ్గించుకుని మిగిలిన వారికి చాన్సులు ఇస్తే బాగుంటుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: