1980 – 1990 ప్రాంతాలలో హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్ ఆతరువాత జరిగిన పరిణామాలతో ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. రాజకీయాల పై కూడ అభిరుచి ఉన్న సుమన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరో ప్రభాస్ హీరోయిజం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
రాజకీయాలపై
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగ వ్రాసిన ‘బాహుబలి’ మూవీ గురించి మాట్లాడుతూ తన దృష్టిలో ఆసినిమాకు ప్రభాస్ హీరో కాడని రానా మాత్రమే హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ‘బాహుబలి’ కథలో భల్లాల దేవుడు పాత్ర లేకుంటే అసలు ‘బాహుబలి’ కథ లేదని అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 
 40 మందిని కొట్టడం
ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ సుమన్ రానా పాత్ర ‘బాహుబలి’ మూవీలో మంటలలో కాలిపోతుందని దీనినిబట్టి చూస్తే ఈమూవీలో రానా పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యత కనిపిస్తుందని కామెంట్ చేసాడు. అంతేకాదు ఒక సినిమాలో 40 మందిని కొట్టడం పెద్ద విషయం కాదు అంటూ ‘బాహుబలి’ మూవీలో విలన్ పాత్ర ఎలివేషన్ వల్ల మాత్రమే ఆసినిమాకు ఆస్థాయిలో ఘన విజయం వచ్చింది అన్న విషయాన్ని సుమన్ వివరించాడు. 
Suman
హీరో పాత్ర కంటే విలన్ ను ఎలివేట్ చేసి చూపించాలి అంటే చాల ధైర్యం ఉండాలి అంటూ అటువంటి సాహసం చేసాడు కాబట్టే రాజమౌళికి అంత పేరు వచ్చింది అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నాడు సుమన్. ఇదే సందర్భంలో సుమన్ మాట్లాడుతూ అవకాసం కలిసి వస్తే తాను రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలి అన్న ఉద్దేశ్యంలో ఉన్నానని అంటూ తన అవసరం ఏరాజకీయ పార్టీకి ఉంటే ఆపార్టీ ప్రచారం కోసం తాను పనిచేయాలని భావిస్తున్నాను అంటూ తన పొలిటికల్ ఎంట్రీకి లీకులు ఇస్తున్నాడు సుమన్..


మరింత సమాచారం తెలుసుకోండి: