హీరో విలన్ అవ్వాలన్నా.. విలన్ హీరో అవ్వాలన్నా.. సినిమాలో ఓ చిన్న పాత్రకు అందరు తెలిసిన వాడు కావాలన్నా అందరు చెప్పుకునే ఒకే ఒక్కపేరు.. అందరు చూసే ఒకే ఒక్క హీరో రానా దగ్గుబాటి. అందరి హీరోల్లా కెరియర్ సెటిల్డ్ గా ప్లాన్ చేసుకోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు రానా దగ్గుబాటి.


బాహుబలి సినిమా ఆ రేంజ్ లో హిట్ అయ్యింది అంటే రాజమౌళి ప్రతిభ, ప్రభాస్ నటన మాత్రమే కాదు అందులో రానా కష్టం కూడా ఉంది. రానా బాలీవుడ్ ప్రేక్షకులకు ఆల్రెడీ పరిచయం ఉన్నాడు కాబట్టి ఆ సినిమా అక్కడ అంత పెద్ద క్లిక్ అయ్యింది. ప్రస్తుతం రానా 1945 అనే పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటిస్తుంది.


సత్యశివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 60 శాతం వరకు పూర్తి కాగా మిగతా సినిమా పూర్తి చేసేందుకు బడ్జెట్ కావాల్సి వచ్చిందట. డైరక్టర్ అనుకున్న బడ్జెట్ మించి సినిమాకు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. నాజర్, సత్యరాజ్ లాంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే రానా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.   


తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమాను కాస్త ప్రమోట్ చేసి హిందిలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రానా హీరోగా వస్తున్న సినిమాకు బడ్జెట్ కాష్టాలు రావడం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత రానా గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశిప సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: