బాలీవుడ్ ఇండస్ట్రీ డర్టీ బ్యూటీగా పేరుగాంచిన విద్యాబాలన్ తన నటనలోనే కాకుండా ఎక్స్ పోజింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడదు. 40 సంవత్సరాల వయసు దాటిపోయిన ఈమె ఈమధ్య సెక్స్ గురించి చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని సృస్టించాయి. 
Vidya Balan poses for the camera
ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఈమధ్య ఒక న్యూయియర్ క్యాలెండర్ కు ఇచ్చిన ఫోటో షూట్ బాలకృష్ణ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ డబూ రత్నాని ఫోటో షూట్ చేసిన ఒక క్యాలెండర్ కు ఆమె విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేస్తూ తనలో గ్లామర్ ఇంకా తగ్గలేదు అన్న విషయాన్ని తెలియ చేసింది.
Vidya Balan
అయితే ఇప్పుడు ఈవిషయమే బాలయ్య అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం లాంటి అత్యంత గౌరవ ప్రదమైన పాత్రను పోషించిన విద్యాబాలన్ తీరు వల్ల రాబోతున్న ‘మాహానాయకుడు’ మూవీలో విద్యాబాలన్ ను బసవతారకం పాత్రలో చూడగలమా అంటూ బాలయ్య అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 
Vidya Balan in super sexy blouse
ఇప్పటికే ‘కథానాయకుడు’ మూవీ ఫెయిల్యూర్ కు మధన పడుతున్న బాలకృష్ణ అభిమానులు విద్యాబాలన్ తీరుతో ‘మహానాయకుడు’ మూవీలో ఆమె కనిపించే బసవతారకం పాత్రను చూస్తున్నప్పుడు ఆమె చేసిన హాట్ ఫోటో షూట్ గుర్తుకు వస్తుంది అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈవిషయాలు విద్యాబాలన్ దృష్టి వరకు వెళతాయో లేదో తెలియకపోయినా 40 సంవత్సరాల తరువాత సెక్స్ పట్ల కోరిక ఎక్కువై పోతుంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరి ఈ కామెంట్స్ ప్రభావం ‘మహానాయకుడు’ పై పనిచేస్తే దానికి కారణం విద్యాబాలన్ అని కామెంట్స్ చేసే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: