నందమూరి అందగాడు బాలయ్య ముఖ్యామంత్రి కుమారుడు, మరో ముఖ్యమంత్రికి బావమరిది. ఆయనకు ముఖ్యమంత్రి గిరికీ అంతటి దగ్గ ర సంబంధం ఉంది. అటువంటిది బాలయ్య ముఖ్యమంత్రి అవడమేంటి అన్న ఆలోచన అందరికీ ఉండవచ్చు. నిజానికి చాలాకాలం క్రితం బాలయ్యను అభిమానులు ముద్దుగా కాబోయే సీఎం అని పిలుచుకునేవారు. సినీ ఫంక్షన్లో నినాదాలు కూడా చేసేవారు. 


కానీ బాలయ్య రాజకీయాల్లోకి వచ్చి కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఆయన 2014 ఎన్నికల్లో అచ్చి వచ్చిన హిందూపురం అసెంబ్లీ సీటు నుంచి మంచి మెజారిటీతో నెగ్గారు. అప్పట్లో బాలయ్య మంత్రి అవుతార‌ని అంతా అనుకున్నారు. కానీ ఏ సభలోనూ సభ్యుడు కానీ అల్లుడు లోకేష్ మాత్రం మంత్రి అయిపోయారు. ఈ ముచ్చట్లు ఇలా ఉండగా బాలయ్య ముఖ్యమంత్రి అంటూ మళ్లీ న్యూస్ వస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా కనిపించేది నిజ జీవితంలో కాదు. వెండి తెర మీద.


చూడబోతే ఇది ఎన్నికల ఏడాది. అటు బాబు, ఇటు జగన్, మరో వైపు పవన్ ఇలా వీరు ముగ్గురూ ముఖ్యమంత్రులం తామేనని అనుకుంటున్న వేళ బాలయ్య మాత్రం తక్కువ తింటారా. ఒకటి కాదు, రెండు సార్లు తానే ముఖ్యమంత్రిని అని అంటున్నారు. అన్న నందమూరి జీవిత చరిత్ర మహానాయకుడు మూవీలో ఎటూ అన్న గారి క్యారక్టర్లో బాలయ్య ముఖ్యామంత్రిగా కనిపించబోతున్నారు. దీనితో పాటే మరో మూవీ బోయపాటి, బాలయ్యల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రంలోనూ బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తారట. 


ఈ మూవీపై అపుడే ఇంటెరెస్టింగ్ అప్ డేట్స్  వెలుగు చూస్తున్నాయి. బాలయ్య పవర్ ఫుల్ సీఎం గా ఇందులో కనిపించి అభిమానులను అదరగొడతారట. మొత్తానికి చూసుకుంటే బాలయ్య సీఎం అన్న అభిమానుల ఆశలను ఆయన ఈ విధంగా తీర్చబోతున్నారన్నమాట. ఏమో గుర్రం ఎగరనూ వచ్చు. రాజకీయ వారసత్వం గట్టిగా  ఉన్న బాలయ్య ఎప్పటికైనా నిజ జీవితంలోనూ ఆ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించినా ఆశ్చర్యమూ లేదుగా.



మరింత సమాచారం తెలుసుకోండి: