నాగార్జునతో తీసిన 'ఆఫీసర్' ఫ్లాప్ కావడంతో పాటు శ్రీరెడ్డి వివాదంలో ఆమెకు సపోర్ట్ ఇచ్చి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ బహిష్కరణను  ఎదుర్కున్న రామ్ గోపాల్ వర్మ గోడకు కొట్టిన బంతిలా తిరిగి తన వేగం పెంచి  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తన కెరియర్ కు సంబంధించి ఒక వజ్రాయుధంలా వాడుకుంటూ మళ్ళీ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.  
 ఆ అంశంతోనే
దీనికోసం ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఆసక్తి కలిగేలా రోజుకొక స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇప్పటి వరకూ క్రిష్ బాలకృష్ణల   ఎన్టీఆర్ బయోపిక్ ను ఒకరకంగా టార్గెట్  చేస్తూ సెటైర్లు వేసిన వర్మ ఈసారి మాత్రం డైరెక్ట్ ఎటాక్ లోకి దిగడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  
Lakshmi's NTR
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాడు అన్న విషయంతో పాటు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నాడో  వివరిస్తూ వర్మ  ట్విట్టర్ లో తనదైన స్టైల్ లో  నాలుగు ట్వీట్లను వదిలి అందరికీ షాక్ ఇచ్చాడు. 'మహానాయకుడు రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించిన 24 నిముషాలకు విడుదల చేయమని స్వర్గం నుంచి ఎన్టీఆర్ హెచ్చరించారు.  తనయుడి సినిమా కథానాయకుడు ను ఎన్టీఆర్ దీవించలేదు కాబట్టి  అయన తప్పనిసరిగా తన భార్య సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను దీవిస్తారు.  దానికి రుజువు ఏంటంటే మహానాయకుడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మధ్య పోటీ ఎన్టీఆర్ ఆశీర్వదించుగాక.' అంటూ ట్విట్ చేసి మరో కలకలంకు తెర తీశాడు.  
దీనితో అసలే 'కథానాయకుడు' పరాజయంతో తలపట్టుకుని కూర్చున్న ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ కు  వర్మ చెమటలు పట్టించేలా వ్యూహాలు రచిస్తున్నాడు అన్న విషయం మరో సారి నిజం అయింది. 

ఇప్పటికే 'మహా నాయకుడు' సినిమా కు సంబంధించి బాలకృష్ణ తనకు  కావలసిన వాటిని మాత్రమే హైలైట్ చేస్తూ వివాదాస్పద విషయాలను పక్కకు పెట్టేస్తున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో  'లక్షీస్ ఎన్టీఆర్' సూపర్ హిట్ అవుతుందోలేదో తెలియక పోయినా ఈ మూవీలో ఎంతోకొంత సంచలనం ఉండి తీరుతుంది అన్న అంచనాలు మొదలు అవుతున్నాయి.  దీనితో  'మహానాయకుడు' మీద మరింతగా నెగిటివిటీ స్ప్రెడ్  అయ్యే విషయంలో   'లక్ష్మీస్ ఎన్టీఆర్' కీలక పాత్ర పోషించే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థుతులలో అనవసరంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ నిర్మించి ఈ నాతటి తరం మర్చిపోయిన విషయాలను గుర్తుకు చేసే ఆస్కారం కలిగించాడు అన్న కామెంట్స్ వినిపిస్తోస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: