టాలీవుడ్లో ఇపుడు విచిత్రమైన వాతావరణం ఉంది. హీరోలు పెరిగారు. సినిమాలు కూడా పెరిగాయి. ప్రతి కుటుంబం నుంచి వారసత్వ హీరోలు వచ్చేస్తున్నారు. దాంతో టాప్ ఫ్యామిలీస్ నుంచే ఎక్కువమంది హీరోల సినిమాలు ఏడాదిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ పరిణామం వల్ల హెరోయిన్లకు డిమాండ్ బాగా పెరిగింది.


తెలుగులో స్టార్ హీరోలు చూసుకుంటే పది మందికి పైగా ఉన్నారు. వారికో సీనియర్లను పక్కన పెడితే యంగ్, మిడిల్ ఏజ్ హీరోలు ఎక్కువే ఉన్నారు. వారందరికీ స్టార్ హీరోయిన్లు కావాలిపుడు. కానీ చూస్తే ఇద్దరు ముగ్గురు కంటే బ్యూటీస్ కనిపించడంలేదు. ఇక మన హీరోలు కూడా ఓ మూవీలో వేసిన హీరోయిన్ ని మరో మూవీలో కంటిన్యూ చేయడానికి ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో ఎందరు వచ్చినా చాలడంలేదు. కొంతమంది  హీరోయిన్లకు స్టార్ స్టాటస్ లేదని కాదని పక్కన పడేస్తున్నారు.


ఈ టైంలో లక్కీయెస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డేను ముందుగా చెబుతున్నారు. పూజా చేసిన మూవీస్ లో పెద్దగా బ్లాక్  బస్టర్లు లేకపోయినా ఈ అమ్మడు లక్కు మాత్రం ఓ రేంజిలో పరిగెడుతోంది. దాంతో పూజా వెంటబడి మరీ కాల్షీట్లు తీసుకుంటున్నారు. దీంతో ఈ ముద్దు గుమ్మ రెమ్యునరేషన్ ఏకంగా కోటీ డెబ్బై లక్షలకు చేరుకుందని టాక్. మహర్షి మూవీకి ఆమెకు అంతే మొత్తం చెల్లించారట. ఇక ప్రభాస్ తో చేస్తున్న మూవీకి కూడా బాగానే  డిమాండ్ చేసిందని అంటున్నారు.


మరో హీరోయిన్ కైరా అద్వానీ ఈ అమ్మడు చేసిన రెండు మూవీస్ లో ఒకటి హిట్, రెండోది ఫట్. కానీ ఇపుడు టాలీవుడ్లో ఉన్న కొరత ఆమెకు ఆఫర్లను తెచ్చిపెడుతోంది. ఆమె సైతం ఉన్న డిమాండ్ ని వాడేసుకుంటూ తన రేట్ పెంచేస్తోంది. వీరిద్దరూ కాకుండా కొత్తగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి కూడా హీరోయిన్లు తెలుగు వైపు చూస్తున్నారుట. తమకు కూడా ఇక్కడ భారీ ఆఫర్లు దక్కుతాయని వాలిపోతున్నారుట. మొత్తానికి బ్యూటీగా ఉంటే చాలు స్టార్లను చేసేస్తామంటోంది టాలీవుడ్.
 



మరింత సమాచారం తెలుసుకోండి: