ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే  సావిత్రి జీవి కథ ఆధారంగా మహానటి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమా అనుకున్నదానికన్నా ఎక్కువే ప్రేక్షాదరణ పొందింది.  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను రెండు బాగాలుగా నిర్మించగా గత నెల సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ చేశారు.  ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
Image result for laxmi ntr
ఈ నెల ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ చేయబోతున్నారు.  ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  మరోవైపు ఎన్టీఆర్ జీవితం, ఆయన భార్య లక్ష్మీపార్వతిపై దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఆయన కుటుంబ సభ్యులను విలన్లుగా చూపించబోతున్నారా..? ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నా అంటూ వర్మ ఇటీవల పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
Image result for laxmis ntr stills
ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నందమూరి హరికృష్ణ పాత్రను విలన్ గా చూపించబోతున్నారా..చివరి రోజుల్లో ఎన్టీఆర్ కి దూరమైన వారిలో ఆయన కూడా ఉన్నారా..లక్ష్మీ పార్వతిని వ్యతిరేకించి వారిలో ఆయనదే కీలక భాగంగా చూపించబోతున్నారా..? ఇలాంటి అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే దర్శకుడు వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమాని ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదల ఆపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ వర్మ మాత్రం సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో స్టిలో పోస్ట్ చేస్తూ ఆసక్తి పెంచుతున్నాడు..అంతే కాదు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: